IMPROVE COMMUNICATION SKILLS RUSA PROJECT DIRECTOR _ విద్యార్థినులు భావప్రకటన నైపుణ్యాలు పెంచుకోవాలి : రూసా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ హరిప్రసాద్
Tirupati, 11 August 2022: Rashtriya Uchchatar Shiksha Abhiyan (RUSA) Director Sri K Hariprasad exhorted students to improve their communication skills besides studies, writing and listening to knowledge materials.
Addressing the 71st foundation day celebrations of Sri Padmavati Mahila Degree and PG college as Chief Guest, he said education helped women enhance their financial empowerment and that the SPW is fully qualified to become a Cluster University.
He said girl students could improve their soft skills along with English communication skills to enhance their employability across the globe.
Another chief guest, Retied Principal of SV Arts College Sri Kristopher said globalisation in the private sector had opened bundles of job opportunities if the girl students could harness several skills.
Retired Telugu department head of the college Dr Premavathi lauded the college for achieving A+ grade of NAAC.
SPW College Principal Dr K Mahadevamma, college faculty members and students were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
విద్యార్థినులు భావప్రకటన నైపుణ్యాలు పెంచుకోవాలి : రూసా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ హరిప్రసాద్
తిరుపతి, 2022 ఆగస్టు 11: విద్యార్థినులు చదవడం, రాయడం, వినడంతోపాటు తమ భావాలను ఎదుటివారికి అర్థమయ్యేలా వివరించగలిగే భావప్రకటనా నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని రాష్ట్రీయ ఉచ్ఛాటర్ శిక్షా అభియాన్(రూసా) ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ కె.హరిప్రసాద్ పిలుపునిచ్చారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పిజి కళాశాల 71వ వ్యవస్థాపక దినోత్సవం గురువారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ హరిప్రసాద్ మాట్లాడుతూ స్త్రీలు విద్యతో ఆర్థిక స్థిరత్వాన్ని పొందగలరని చెప్పారు. ఎస్‌పిడబ్ల్యు కళాశాల క్లస్టర్ యూనివర్సిటీ అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. మెదడును శరీరానికి సమన్వయం చేస్తే విజయం సాధించవచ్చని అన్నారు. విద్యార్థినులు హార్ట్ స్కిల్స్‌తోపాటు సాఫ్ట్ స్కిల్స్‌ను కూడా అభివృద్ధి చేసుకుని ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడగలిగితే ప్రపంచంలో ఉద్యోగావకాశాలు అనేకం ఉన్నాయన్నారు.
మరో అతిథిగా హాజరైన ఎస్వీ ఆర్ట్స్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ శ్రీ క్రిష్టోఫర్ మాట్లాడుతూ ప్రపంచీకరణ దృష్ట్యా ప్రయివేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు అనేకం ఉన్నాయని, విద్యార్థినులు నైపుణ్యాన్ని పెంచుకుని అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు.
కళాశాల విశ్రాంత తెలుగు విభాగాధిపతి డా.ప్రేమావతి మాట్లాడుతూ కళాశాలకు న్యాక్ ఎ ప్లస్ గ్రేడ్ రావడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. కె.మహదేవమ్మ, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.