IN VIEW ON THE ELECTION CODE NO RECOMMENDATION LETTERS FOR SRIVARI DARSHAN AND ACCOMMODATION IN TIRUMALA _ ఎన్నికల కోడ్ నేపథ్యంలో గ‌తంలో వ‌లె తిరుమ‌ల‌లో వ‌స‌తి, శ్రీవారి దర్శనానికి సిఫార‌స్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు

Tirumala, 16 March 2024: In view of the Election Code, TTD has made certain changes in VIP Darshan and accommodation which has come with immediate effect from Saturday onwards.

Henceforth the letters of recommendation for accommodation and darshan in Tirumala will not be accepted as in the past. However, the Srivari darshan and accommodation will be considered only to the protocol dignitaries who come by themselves as per the rules till the code is over.

In a statement released in the context of the Lok Sabha and Assembly Election Code, the TTD said as per the decision of the TTD Trust Board the letters of recommendation for accommodation and Srivari darshan in Tirumala is cancelled from Saturday onwards.

Therefore, TTD appealed to the devotees and VIPs to take note of this matter and cooperate with the management.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఎన్నికల కోడ్ నేపథ్యంలో గ‌తంలో వ‌లె తిరుమ‌ల‌లో వ‌స‌తి, శ్రీవారి దర్శనానికి సిఫార‌స్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు

– స్వ‌యంగా వ‌చ్చే ప్రోటోకాల్‌ ప్రముఖులకు నిబంధనల ప్రకారం శ్రీవారి దర్శనం, వసతి.
టీటీడీ

తిరుమల, 2024 మార్చి 16: లోక్‌స‌భ‌, అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేప‌థ్యంలో టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నిర్ణ‌యం మేర‌కు శనివారం నుండి తిరుమ‌ల‌లో వ‌స‌తి, శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

స్వ‌యంగా వ‌చ్చే ప్రోటోకాల్‌ ప్రముఖులకు, వారి కుటుంబ స‌భ్యుల‌కు నిర్దేశించిన విధివిధానాల మేర‌కు ద‌ర్శ‌నం, వ‌స‌తి క‌ల్పిస్తారు. ఎన్నికల ప్రక్రియ పూర్త‌య్యేవ‌ర‌కు ఏ రకమైన వ‌స‌తి, దర్శనాలకు కూడా సిఫారసు లేఖలు స్వీకరించబడవు.

కావున భక్తులు మరియు విఐపిలు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.