INAUGURATION OF TRAINING SESSION FOR TTD TEACHERS BY LEAD INDIA 2020 _ యువ‌త‌కు మాన‌వీయ విఉల‌వ‌లు బోధించాలి – టిటిడి ఈవో శ్రీకె.వి.రమణాచారి

Tirupati, 22 July 2008: The teachers have a very prominent role in moulding the character of the students told Sri K.V.Ramanachary, Executive Officer, TTDs. Speaking on the occasion organized by Lead India 2020 at SVETA on Tuesday the Executive Officer said that every individual has his own skills and those skills should be useful to the society. Under Lead India 2020 as wished by Dr. Abdul Kallam, the former president of India, he motivated 100 teachers working in TTD educational institutions to get training on various issues so as to train their students into patriotic students. He requested the teachers that they have to teach the present student generation about our own culture, traditions. They should also invariably follow the ancestor path i.e., respecting mother, father, teacher and god.

Sri N.D.Sudharshana Charyulu, the national coordinator of Lead India 2020 said that out of 113 crores of the population in India 55% of the population are in the age of 25 years and ancient India is becoming a young India. In the ensuing days one lakh students in each district will be given training in A.P so as to bring patriotism on our country, respect towards our culture, traditions etc., in order to see vasudaika kutumbam.

Sri Bhuman, Director SVETA, Dr. Nagaraju, DEO TTDs have addressed the gathering.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

యువ‌త‌కు మాన‌వీయ విఉల‌వ‌లు బోధించాలి – టిటిడి ఈవో శ్రీకె.వి.రమణాచారి

తిరుపతి, జూలై-22,  2008: నేటి విద్యార్థులకు మంచి మానవీయవిలువలను బోధించడం ద్వారా మెరుగైన సమాజాన్ని చూడవచ్చునని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీకె.వి.రమణాచారి అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక శ్వేత నందు జరిగిన ”లీడ్‌ ఇండియా 2020”  కార్యక్రమానికి ఆయన అధ్యక్షతవహించారు.

ఈ సందర్భంగా ఇ.ఓ., మాట్లాడుతూ ”లీడ్‌ ఇండియా 2020” అను కార్యక్రమానికి రూపశిల్పి మాజీ రాష్ట్రపతి డా||అబ్దుల్‌కలాం అని, ఆయన చెప్పినట్లుగా ”కలలు కనండి-సాకారం చేయండి” అన్న విషయాన్ని యువతకు ఉద్భోదించాలని ఆయన చెప్పారు. తి.తి.దే., విద్యాసంస్థల్లో పనిచేయు దాదాపు 100 మంది టీచర్లను శిక్షణకై ఎంపిక చేశామని, నేను సైతం ఈ సమాజం కోసమని ముందుకు వచ్చిన 100 మంది టీచర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈదేశ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థుల స్వభావస్వరూపాలను మార్చడానికి అధ్యాపకులపై  గురుతర బాధ్యత ఉన్నదని, మొదట వీరు ఆత్మస్థెర్యాన్ని  ధైర్యాన్ని పెంచుకోవాలని, అటు పిమ్మట ఈదేశానికి థాదిశ నిర్దేశం చేసేవారిని సృష్టించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఒక అబ్దుల్‌కలాం, మణివన్నన్‌ లాంటి వారిని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని, మణివన్నన్‌ లాంటి యువకులను మెండుగా తయారుచేయాలని ఆయన అధ్యాపకులకు తెలుపుతూ ఇవన్నీ సంకల్ప బలం, పట్టుదల, అకుంఠిత దీక్ష ద్వారానే సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. విధ్యార్థులకు పెద్దలపట్ల వినయం, దైవం, దేశభక్తిని గురించి చెప్పాలని, ఒక దీపం మరో దీపంను వెలిగించినట్లు మనం కొంతమందికి వెలుగును ప్రసాదించాలని అప్పుడే మన యువకులు ఉత్తేజితులై ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారుచేయగలరని చెప్పారు.

 ”లీడ్‌ ఇండియా 2020” జాతీయ సమన్వయకర్త శ్రీఎన్‌.డి.సుదర్శనాచార్యులు మాట్లాడుతూ నేడు మనదేశ జనభా 113 కోట్లు ఉండగా అందులో 55 శాతం 25 ఏళ్ళ వయస్సులోపే ఉన్నారని, 2017 నాటికి యుక్త వయస్సులో ఉన్నవారి సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పారు.

వసుదైక కుటుంబం అనునది మన సనాతన భారతీయ సంస్కృతిలో ఒక అంతర్భాగమని, మన పిల్లలకు పాశ్చాత్య సంస్కృతి విషవలయంలో చిక్కుకోకుండా, మనదైన సంస్కృతిని గౌరవించడం, దేశభక్తిని పెంచుకోవడం, సాటివ్యక్తికి సహాయపడడం, సేవలు చేయడం వంటి వాటిని గూర్చి నేర్పించాల్సిన అవసరం ఉందని, అప్పుడే డా||అబ్దుల్‌కలాం చెప్పినట్లు ”కలలుకందాం-వాటిని సాకారం చేద్దాం” అనునది నిజమవుతుందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి జిల్లాలో ఒక్కొక్క లక్షమంది చొప్పున 23 లక్షలమంది  విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. జూలై 22వ తేది నుండి 26వ తేది వరకు నిర్వహించే ఈ శిక్షణా కార్యక్రమంలో విధ్యార్థుల ద్వారా దేశ నిర్మాణాన్ని ఎలా చేయాలో తెలియజేస్తామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో తితిదే విధ్యాశాఖాధికారి డా||కె.నాగరాజు, శ్వేత డైరెక్టర్‌ శ్రీభూమన్‌ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.