INCHARGE JEO, CVSO TIRUMALA INSPECTS QUEUE LINES_ తిరుమలలో భక్తుల క్యూలైన్లను పరిశీలించిన జెఈవో, సివిఎస్‌వో

Tirumala, 13 August 2017: In view of heavy influx of pilgrims which flooded Tirumala on Sunday, the In-charge JEO of Tirumala Sri P Bhaskar inspected the queue lines along with CVSO Sri A Ravikrishna.

The top brass official duo of TTD interacted with the pilgrims in queue lines at Narayanagiri Gardens. The JEO also monitored the distribution of annaprasadam and water in queue lines.

Later speaking to media persona the JEO said, the week end coupled with holidays resulted in unprecedented pilgrim crowd. He said till 8pm on Sunday over 80thousand pilgrims had darshan of Lord. “We are contemplating to provide darshan to over one lakh by the end of the day which closes by 12:30midnight. I urge the pilgrims to co-operate with TTD”, he maintained.

The CVSO said TTD has made elaborate security arrangements in view of pilgrim crowd to see that no untoward incident takes place. “Since there is heavy crowd I urge the pilgrims to take care of their children and also co-operate in security check in both footpath routes.

Temple Dyeo Sri Kodanda Rama Rao, Annaprasadam Dyeo Sri Venugopal, Catering Officer Sri Sastry and other officers were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమలలో భక్తుల క్యూలైన్లను పరిశీలించిన జెఈవో, సివిఎస్‌వో

ఆగస్టు 13, తిరుమల, 2017 : తిరుమలలో రద్దీ నేపథ్యంలో భక్తుల క్యూలైన్లను టిటిడి తిరుమల ఇన్‌చార్జి జెఈవో శ్రీపోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ కలిసి ఆదివారం రాత్రి పరిశీలించారు. నారాయణగిరి ఉద్యానవనాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని సర్వదర్శనం క్యూలైన్లను పరిశీలించి ఎలాంటి జాప్యం లేకుండా భక్తులకు దర్శనం కల్పించాలని అధికారులను ఆదేశించారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, చంటిపిల్లలకు పాలు అందించాలని సూచించారు.

ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు విశేష సంఖ్యలో భక్తులు విచ్చేశారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. రాత్రి 8 గంటల వరకు 80 వేల మందికిపైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్టు చెప్పారు. ఆదివారం రాత్రి వరకు ఒక లక్ష మంది భక్తులకు దర్శనం చేయించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. భక్తులు సంయమనం పాటించి టిటిడికి సహకరించాలని కోరారు.

సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ అధిక రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతాపరంగా పూర్తిగా ఏర్పాట్లు చేపట్టామన్నారు. భక్తులకు ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే దగ్గరలోని సెక్యూరిటీ సిబ్బందికి తెలియజేయాలని, వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ తనిఖీల్లో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, విజివో శ్రీ రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.