INCREASE MEMORY POWER WITH AYUR SWARNA PRASHANA- JEO (E&H) _ స్వ‌ర్ణ‌ప్రాశ‌న ఔష‌ధంతో జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది- జేఈవో శ్రీమతి సదా భార్గవి

* 357 PRODUCTS FROM SV AYURVEDA PHARMACY

Tirupati,10 September 2023: TTD JEO for Health and Education Smt Sada Bhargavi on Sunday said the ayurvedic medicine Swarna Prashana had solutions provided in ancient Ayurvedic doctrines for improving the memory and digestive powers among children.

Speaking on the occasion of distribution program of Swarna Prashana to students of TTD run SV Bala Mandiram sponsored by the SV Ayurveda hospital of TTD, the JEO said the ultimate solution was scripted in the Kasyapa Samhita by our sages thousands of years ago.

The Swarna Prashana could be used by children from six months to16 years for enhancing their mental and digestive health.

She complimented the Dabur India Ltd for assisting the SV Ayurvedic Pharmacy to achieve production of Swarna Prashana and that TTD has geared up to produce 357 ayurvedic medicines soon.

TTD PRO Dr T Ravi lauded the present period as a golden era for both education and medical sectors in TTD as they are achieving remarkable progress under the able administration and guidance of JEO.

Dabur India ltd representative Sri Mubarak, SV Ayurveda college Principal Dr Murali Krishna, Ayurveda Hospital medical Superintendent Dr Renu Dikshit, Bala Mandiram AEOs Smt Ammulu, doctors and students were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

స్వ‌ర్ణ‌ప్రాశ‌న ఔష‌ధంతో జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది

– ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీ నుండి త్వరలో 357 ఉత్పత్తులు

– జేఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుప‌తి, 2023 సెప్టెంబ‌రు 10: స్వ‌ర్ణ‌ప్రాశ‌న ఔష‌ధంతో పిల్ల‌ల్లో జ్ఞాప‌క‌శ‌క్తి, రోగ‌నిరోధ‌క శ‌క్తి, మేథ‌స్సు, జీర్ణ‌శ‌క్తితో పాటు ఆయుష్షు పెరుగుతుంద‌ని ఆయుర్వేద గ్రంధాలలో ఉన్నట్లు జేఈవో శ్రీమతి సదా భార్గవి అన్నారు. ఎస్వీ ఆయుర్వేద ఆసుప‌త్రి ఆధ్వ‌ర్యంలో ఆదివారం ఎస్వీ బాల‌మందిరం విద్యార్థులకు స్వ‌ర్ణ‌ప్రాశ‌న ఔష‌ధం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు కాశ్య‌ప‌సంహిత గ్రంథంలో స్వ‌ర్ణ‌ప్రాశ‌న గురించి తెలియజేశారన్నారు. ఇందులో ఆరు నెల‌ల నుండి 16 ఏళ్లలోపు పిల్ల‌లు ఈ ఔష‌ధాన్ని తీసుకోవచ్చని చెప్పారు. చిన్నతనం నుండి ఆయుర్వేద మందులు వాడడం అలవాటు చేసుకోవాలన్నారు. ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీ ఆధ్వర్యంలో త్వరలో 357 ఔషధాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. స్వ‌ర్ణ‌ప్రాశ‌న ఔష‌ధం ఉత్పత్తికి సహకరించిన డాబర్ ఇండియా లిమిటెడ్ వారికి జేఈవో కృతజ్ఞతలు తెలిపారు.

టీటీడీ పిఆర్వో డాక్టర్ టి. రవి మాట్లాడుతూ, టీటీడీ విద్యా సంస్థల విద్యార్థులందరికీ ఈ ఔష‌ధాన్ని అందించాలన్నారు. టీటీడీ నిర్వహణలో ఉన్న స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల వలె ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి కూడా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. జేఈవో ఆధ్వర్యంలో టీటీడీ విద్య, వైద్య రంగాలకు స్వర్ణ యుగమని వివరించారు.

ఈ కార్యక్రమంలో డాబర్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధి శ్రీ ముబారక్, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీకృష్ణ, ఆయుర్వేద ఆసుపత్రి సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ రేణుదీక్షిత్, బాల మందిరం ఏఈవో శ్రీమతి అమ్ములు, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.