INCREASE USE OF GENERIC MEDICINE IN TTD HOSPITALS- EO _ టీటీడీ ఆసుపత్రుల్లో జనరిక్ మందుల వాడకం పెంచాలి

DIRECTS TO GO FOR NEW TENDERS 4 MONTHS AHEAD OF EXPIRY OF OLD TENDERS

 Tirupati, 3 August 2021: TTD Executive Officer, Dr KS Jawahar Reddy has directed officials to enhance the use of generic medicine at all TTD hospitals.

Addressing a review meeting with SVIMS and BIRRD officials at Sri Padmavati Rest House in Tirupati on Tuesday evening the TTD EO also instructed that all purchases of drugs and medical equipments shall be processed only through the central purchase department.

He enquired about tendering of medicines at SVIMS and asked the officials to commence the tender’s proceedings four months in advance of the expiry of old tenders for purchasing medicines and medical equipment.

He said officials who sents proposals on the list of medicines should not become members of purchase committees and advised to opt for a member from the Government Drug Control Board.

The EO also directed that drug purchase the policy should be on the model of NIMS and NIMHANS and purchases the drugs adequate for two years at one go.

He also advised TTD officials to compare the drugs prices prevailing in states of Karnataka, Tamilnadu and Telangana before placing orders.

Additional EO Sri AV Dharma Reddy, FA& CAO Sri O Balaji, CE Sri Nageswara Rao, BIRRD RMO Sri Sesha Shailendra, SVIMS Medical Superintendent Dr Ram, TTD CMO Dr Muralidhar, SVIMS Purchase wing officials Dr Venkatarami Reddy, Dr Erram Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీ ఆసుపత్రుల్లో జనరిక్ మందుల వాడకం పెంచాలి

– టెండరు గడువుకు నాలుగు నెలల ముందే కొత్త టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలి

ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి

తిరుపతి 3 ఆగస్టు 2021: టీటీడీ నిర్వహణ లోని ఆస్పత్రులన్నింటికీ అవసరమయ్యే మందులు, వైద్య పరికరాలు కేంద్రీకృత కొనుగోలు విభాగం నుంచి కొనుగోలు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ ఆసుపత్రుల్లో జనరిక్ మందుల వాడకం పెంచడంతో పాటు వాటిని ప్రోత్సహించాలన్నారు.

తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో మంగళవారం సాయంత్రం ఆయన మందులు, వైద్య పరికరాల కొనుగోలు విధానం పై సమీక్ష నిర్వహించారు.

స్విమ్స్ లో మందులు, పరికరాల కొనుగోలు కోసం టెండర్లు నిర్వహిస్తున్న విధానం తెలుసుకున్నారు. టెండర్ కాల పరిమితి పూర్తి కావడానికి నాలుగు నెలల ముందు నుంచే మళ్లీ టెండర్లు ఆహ్వానించే కసరత్తు ప్రారంభించాలన్నారు. ఏమందులు కావాలో ప్రతిపాదనలు పంపే అధికారులు వాటి నాణ్యత నిర్ధారించే కమిటీలో ఉండకూడదని చెప్పారు. ప్రభుత్వ డ్రగ్ కంట్రోల్ విభాగం నుంచి ఈ కమిటీలో ఒకరిని ఏర్పాటు చేసుకోవాలని ఈవో సూచించారు. రెండేళ్లకు సరిపడే మందులు ఒకే సారి కొనుగోలు చేసుకుకోవాలని ఇందుకోసం నిమ్స్, నింహ్యాన్స్ ఆసుపత్రులు అవలంభిస్తున్న విధానం అమలు చేసుకోవాలని ఈవో చెప్పారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ లో మందులు ఏ ధరకు సరఫరా చేసున్నారో కూడా తెలుసుకోవాలని అన్నారు.

అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి,జెఈవో శ్రీమతి సదా భార్గవి, ఎఫ్ ఏ అండ్ సీఏఓ శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, బర్ద్ ఆర్ఎమ్ఓ శ్రీ శేష శైలేంద్ర, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మురళీధర్, స్విమ్స్ కొనుగోలు విభాగం అధికారులు డాక్టర్ వెంకటరామిరెడ్డి, డాక్టర్ ఎర్రమ రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది