RENDER SERVICES WITH DEDICATION-JEO SRI KS SREENIVASA RAJU_ మరింత సేవాభావంతో భక్తులకు సేవలందిద్దాం : తిరుమల జెఈవో తిరుమలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

Tirumala, 15 Aug. 17: Offering services to the multitude of visiting pilgrims is the best tribute which we can offer to our country on this auspicious occasion, asserted Tirumala JEO Sri KS Sreenivasa Raju.

Addressing the employees in Tirumala after hoisting the National Flag in Gokulam Rest House premises on Tuesday, the JEO recalling the sacrifices of great national leaders, called upon the employees to follow their footsteps and offer transparent, dedicated services to pilgrims in Tirumala.

“The recently introduced room allotment system through tokens at CRO, providing Darshan to 20000 pedestrian pilgrims without waiting in compartments, help desks, separate counter for aged and physically challenged have received overwhelming response from the masses. All the schemes have become success with the team work of the employees. I wish you all will continue to work with same spirit in future too”, he maintained.

SE II Sri Ramachandra Reddy, SE Electricals Sri Venkateswarulu, VGOs Sri Ravindra Reddy, Smt Sada Lakshmi, Health Officer Dr Sermista, DyEOs Sri Rajendrudu, Sri Venkataiah, Sri Harindranath and other officers were also present.

“BE VIGILANT ALWAYS”-VGO

TTD VGO Sri Ravindra Reddy called upon the vigilance and security sleuths to be more alert and watch with eagle eyes to provide security cover to pilgrims and Tirumala.

During his Independence Day address after hoisting the national flag in front of VGO office in Tirumala, the VGO of Tirumala said, as Tirumala is always busy with pilgrim activity, the vigilance and security sleuths should be alert round the clock.

VGO Smt Sadalakshmi, AVSOs, VIs were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మరింత సేవాభావంతో భక్తులకు సేవలందిద్దాం : తిరుమల జెఈవో తిరుమలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

తిరుమల, 2017 ఆగస్టు 15: ప్రపంచం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు మరింత త్వరగా, సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు టిటిడి తీసుకొచ్చిన అనేక భక్తజనరంజక సంస్కరణల కారణంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, టిటిడి ఉద్యోగులు ఇదే స్ఫూర్తితో మరింత అంకితభావంతో భక్తులకు సేవలందించాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పిలుపునిచ్చారు. తిరుమలలోని గోకులం అతిథిగృహంలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో జెఈవో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. అనంతరం భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని జెఈవో స్వీకరించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించి 70 వసంతాలు పూర్తి చేసుకుని, 71వ సంవత్సరములోనికి అడుగిడినట్లు తెలిపారు. ఎందరో వీరుల త్యాగఫలంగా మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని, ఈ సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకోవడం మన కనీస బాధ్యత అని తెలిపారు. కాలినడక మార్గంలో తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులసౌకర్యార్థం టిటిడి జూలై 17వ తేదీ నుండి నూతనంగా ప్రవేశ పెట్టిన నిర్దిష్ట సమయం కేటాయింపునకు భక్తుల నుండి విశేష స్పందన వస్తోందని తెలిపారు. దీని ద్వారా ప్రతి రోజు 20 వేల మందికి వేచివుండకుండా నిర్దిష్ట సమయంలో శ్రీవారి దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు విస్తృత ప్రచారం ద్వారా ఆరు లక్షల మంది అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాల్లో శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిపారు.

శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రెండు క్యూలైన్ల విధానం ద్వారా భక్తుల మధ్య తోపులాట లేకుండా ప్రతి రోజు 90 వేల మంది స్వామివారి దర్శనం చేసుకుంటున్నారని తెలిపారు. భక్తుల రద్దీ విపరితంగా పెరిగినా, టిటిడి అన్న ప్రసాదం విభాగం, విజిలెన్స్‌, పారిశుద్ధ్యం, ఇతర విభాగాలు విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లు, ఫోన్‌ సౌకర్యం, చిన్న పిల్లలకు పాలు, వసతి కొరకు సెల్‌ఫోన్‌కు ఎస్‌.ఎమ్‌.ఎస్‌ ద్వారా తెలియజేయడం భక్తులకు మరింత సౌకర్యవంతంగా వున్నట్లు తెలిపారు. హెల్ప్‌డెస్క్‌ ద్వారా భక్తుల ఫిర్యాదులను, సూచనలను సత్వరం పరిష్కరిస్తున్నట్లు తెలియజేశారు.

శ్రీవారి దర్శనం కోసం రోజురోజుకు పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని టిటిడి సిబ్బంది మరింత బాధ్యతతో సేవలందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిటిడి వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఇ శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ (ఎలక్ట్రికల్‌) శ్రీ వేంకటేశ్వర్లు, టిటిడి ఆరోగ్య విభాగం అధికారి శ్రీ శర్మిష్ఠ, ముఖ్య భద్రతాధికారి శ్రీ రవీంద్రారెడ్డి, ముఖ్య నిఘా అధికారి శ్రీమతి సదాలక్ష్మీ, డెప్యూటీ ఈవోలు శ్రీ వెంకటయ్య, శ్రీమతి ఝాన్సీ, క్యాటరింగ్‌ అధికారి శ్రీ శాస్త్రీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి భద్రతా సిబ్బంది డేగ కళ్ళతో వీక్షించాలి – విజివో

శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, నిరంతరం అప్రమత్తంగా వుండి, క్షుణ్ణంగా పరిశీలించాలని టిటిడి విజివో శ్రీ రవీంద్రారెడ్డి సిబ్బందికి సూచించారు. తిరుమల విజివో కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకల్లో జెఈవో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. అనంతరం భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది