INTEGRITY PLEDGE ADMINISTERED _ టిటిడి ఉద్యోగులు సమగ్రతా ప్రతిజ్ఞ
Tirumala, 31 Oct. 19:As a part of the Vigilance Awareness Week, the Integrity Pledge has been administered on Thursday by the Vigilance wing officials at Tirumala.
The oath was taken by the Temple, laddu counters, Trilok, Vahana Mandapam, luggage counters, Vigilance staffs who pledged for a corruption-free working environment in Tirumala. It may be mentioned here that the Vigilance Awareness Week is being observed by TTD as a part of the clarion call given by the Central Vigilance Commission(CVC) in view of the Birth Anniversary of Sardar Vallabahai Patel on October 31.
VSOs Sri Manohar, Sri Prabhakar, AVSO Sri Chiranjeevi and other vigilance sleuths were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి ఉద్యోగులు సమగ్రతా ప్రతిజ్ఞ
తిరుమల, 2019 అక్టోబరు 31 ;విజిలెన్స్ అవగాహన వారోత్సవంలో భాగంగా తిరుమలలో గురువారం టిటిడి విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో వివిధ విభాగాల ఉద్యోగులు సమగ్రతా ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ పిలుపు మేరకు “సమగ్రత – ఒక జీవన విధానం” అనే అంశంపై అక్టోబరు 28 నుండి నవంబరు 2వ తేదీ వరకు టిటిడి విజిలెన్స్ అవగాహన వారోత్సవం నిర్వహిస్తోంది. అక్టోబరు 31న ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ వారోత్సవం నిర్వహిస్తున్నారు.
ఇందులోభాగంగా గురువారం ఉదయం శ్రీవారి ఆలయ వాహన మండపం వద్ద, దివ్యదర్శనం కాంప్లెక్స్ వద్ద శ్రీవారి ఆలయంలో పనిచేస్తున్న విజిలెన్స్ అధికారులు, నిఘా సిబ్బంది, లడ్డూ కౌంటర్ల సిబ్బంది, త్రిలోక్ సిబ్బంది ఇతర ఉద్యోగులు కలిసి ప్రతిజ్ఞ చేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తామని, త్రికరణ శుద్ధితో భక్తులకు సేవ చేస్తామని, టిటిడి ప్రతిష్టకు భంగం కలగకుండా నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో విఎస్వోలు శ్రీ మనోహర్, శ్రీ ప్రభాకర్, ఎవిఎస్వో శ్రీ చిరంజీవి ఇతర నిఘా, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.