INTERNATIONAL YOGA DAY AT ASTANA MANDAPAM ON JUNE 21 _ జూన్‌ 21న ఆస్థానమండపంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం 

TIRUMALA, 17 JUNE 2023: In connection with International Yoga Day on June 21, Indo-Tibetan Border Police Force is organising a training programme in Yoga for TTD employees and devotees.

 

The programme will take place at Astana Mandapam in Tirumala on that day between 6am and 8am.

 

The 53 Batallion Deputy Commandant Sri Ayush Deepak is supervising the arrangements.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జూన్‌ 21న ఆస్థానమండపంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

తిరుమల, 2023 జూన్‌ 17: తిరుమల ఆస్థానమండపంలో జూన్‌ 21న ఉదయం 6 నుండి 8 గంటల వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగనుంది. ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో యోగా శిక్షకులు ఇందులో యోగాసనాలు, వాటి వల్ల శారీరకంగా, మానసికంగా కలిగే ఉపయోగాలను తెలియజేస్తారు.

ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌తోపాటు టీటీడీ ఉద్యోగులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ 53 బెటాలియన్‌ డెప్యూటీ కమాండెంట్‌ శ్రీ ఆయుష్‌ దీపక్‌ ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది