APPLICATIONS FOR JUNIOR LECTURER AND SCHOOL ASSISTANT JOBS IN TTD_ టిటిడిలో జూనియర్ లెక్చరర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఉద్యోగుల నుండి దరఖాస్తుల ఆహ్వానం
Tirupati, 7 February 2018: The TTD has invited applications for posts of Junior lecturers and school asistants in the TTD colleges and schools.
Those seeking above jobs should have 3 years experience and apply before Febraury 19. The eligible qualification for junior lecturer posts were besides rules of reservation besides post graduation degree with 50 % marks. For school asistants posts the canddates should have graduate degree with B Ed degree and methodology in concerned subjects. Contact the Devathanams Education Officer for more details.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
టిటిడిలో జూనియర్ లెక్చరర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఉద్యోగుల నుండి దరఖాస్తుల ఆహ్వానం
ఫిబ్రవరి 07, తిరుపతి, 2018: టిటిడి ఆధ్వర్యంలోని కళాశాలలు, పాఠశాలల్లో ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన టిటిడి రెగ్యులర్ ఉద్యోగుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది. ఉద్యోగులు మూడేళ్ల సర్వీసును పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తులను ఫిబ్రవరి 19వ తేదీలోపు సమర్పించాల్సి ఉంటుంది.
మొత్తం 11 జూనియర్ లెక్చరర్ పోస్టులున్నాయి. దరఖాస్తుదారులు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తిస్తుంది.
స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు డిగ్రీతోపాటు ఆయా సబ్జెక్టు మెథడాలజితో బి.ఇడి పూర్తి చేసి ఉండాలి.
ఇతర వివరాలకు టిటిడి విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని సంప్రదించగలరు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.