INTRODUCE PANCHA VAADYAS DURING VAHANAM PROCESSIONS_ ‘డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

LAUNCH SVBC HINDI CHANNEL ALSO

Tirumala, 2 February 2018: While lauding the elaborate arrangements made by TTD during the annual brahmotsavams last year and for the recently held Radhasapthami festival, a devotee Sri Bhaskaran from Chennai, sought the TTD EO Sri Anil Kumar Singhal to introduce “Pancha Vaidya Melam” in front of Vahana sevas.

The monthly “Dial Your EO” programme was held at Annnamaiah Bhavan in Tirumala on Friday where in 27 callers from across the country brought to the notice of EO on various issue. During this program, a caller from Chennai said, Pancha Vaidyams which includes five instruments namely Timila, Maddalam, Ilathalam, Iddaka and Kombu used to be one of the most traditional and classical instruments used during procession of great religious festivals. The devotee said, it acts as a special attraction and is unique during temple fete at Guruvayur. TTD can also introduce it for its brahmotsavams, radhasapthami”, he added.

Replying the caller, the EO said, recently TTD has also written letters to all the states across the country, to send their traditional art teams to perform during brahmotsavams. “At present only artistes from AP, TS, TN, Karnataka and Maharastra are taking part in our festivals. We are hopeful of more traditional art forms to perform during annual fete next year”, he added.

Callers Sri Siva Linga from Tamilnadu and Sri Dattatreya from Anantapur sought the EO to introduce SVBC in Hindi also on the lines of Tamil and Kannada as many people across the country witness the programme. While Sri Sivalinga also suggested EO to see that the entire Dial your EO programme be translated in Hindi. EO said, the suggestion will be observed.

Sri Srinivasa Rao from Tenali sought the EO to give a chance to the children who are not graded artistes to perform on Nada Neerajanam platform in Tirumala in the mornings as a token of encouragement and also during Annamacharya Vardhanti and Jayanti. The EO replied the caller that his suggestion will be discussed with concerned experts.

Another pilgrim caller Sri Ramachandraiah from Kadapa sought the EO to construct a temple in their backward colony for which EO said, TTD has already taken up the construction of temples in SC, ST colonies in a big way. We have granted Rs.25cr towards the construction of temples in SC, ST colonies and also giving training to them in priesthood. We will definitely consider your request”, he added.

When a pilgrim caller Sri Sunil from Suryapeta brought to the notice of EO about the non-allotment of guesthouse in Sri Padmavathi area in Tirumala since he has no VIP recommendation letter, the EO said, there is no such restriction. If we have rooms available in VIP rest house area, we will allot you without any recommendation”, he cleared.

While callers Sri Madhav from Srikakulam, Smt Ramadevi and Smt Lavanya from Hyderabad, Sri Karunakaran from Bengaluru, another pilgrim Dr Raghunath Reddy asked EO on on-line dip system, for which he answered that the online quota has been giving transparent results and majority of pilgrims are expressing their pleasure over the system.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

‘డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

ఫిబ్రవరి 2, తిరుమల 2018: తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1. శ్రీనివాసులు – అనంతపురం. మధుసూదన్‌ – హైదరాబాద్‌

ప్రశ్న: శ్రీవారి ఆలయంలో భక్తులు ఓర్పు, సహనంగా ఉండేలా, భక్తి భావం పెంచేలా బోర్డులు ఏర్పాటు చేయండి?

ఈ.వో. క్యూలైన్లలో భక్తులు సంయమనంతో వ్యవహరించాలి. భక్తులలో భక్తిభావాన్ని మరింత పెంచేలా బోర్డుల ఏర్పాటుతోపాటు తరచూ ప్రకటనలు చేస్తాం.

2. చంద్రశేఖర్‌ – హైదరాబాద్‌

ప్రశ్న: గర్భాలయంలో స్వామివారు స్పష్టంగా కనిపించేలా దీపాల వెలుగు పెంచండి?

ఈ.వో. పరిశీలించి తగుచర్యలు తీసుకుంటాం.

3. ఉమాశంకర్‌్‌ – విజయవాడ

ప్రశ్న: రథసప్తమి ఏర్పాట్లు బాగున్నాయి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రూ.100 టికెట్‌ దర్శన క్యూలైన్‌ వద్ద బోర్డు ఏర్పాటు చేయండి ?

ఈ.వో. తప్పకుండా ఏర్పాటు చేస్తాం.

4. సీత – హైదరాబాద్‌

ప్రశ్న: సీనియర్‌ సిటిజన్‌ల వయసు 65 సంవత్సరాలు ఏ ప్రాతిపదికన పెట్టారు?

ఈ.వో. వయసుపైబడి నడవలేని వారిని, దివ్యాంగులను ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా దర్శనానికి పంపుతున్నాం.

5. మాధవ్‌ – శ్రీకాకుళం

ప్రశ్న: దర్శన టికెట్లు, ఆర్జిత సేవల టికెట్లు ఆన్‌లైన్‌లో పెట్టడం వల్ల పేద, మధ్యతరగతి వర్గాలవారికి బుక్‌ చేసుకోవడం ఇబ్బందిగా ఉంది ?

ఈ.వో. ఎక్కువమంది భక్తుల కోరిక మేరకు దర్శన టికెట్లను, ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌ ఉంచాం.

6. సత్యమూర్తి – తణుకు

ప్రశ్న: అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో స్వామివారు కూర్చుని ఉండేలా ఏర్పాటు చేయండి?

ఈ.వో. అలాగే చేస్తాం.

7. శివలింగం – తమిళనాడు

ప్రశ్న: డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమాన్ని హిందీలో నిర్వహించండి?

ఈ.వో. మీకు ఫోన్‌ చేసి సమస్యలను తెలుసుకుంటాం.

8. భాస్కరన్‌ – చెన్నై

ప్రశ్న: శ్రీవారి బ్రహ్మూెత్సవాలలో పంచవాద్యాన్ని ప్రవేశపెట్టండి?

ఈ.వో. పరిశీలిస్తాం. ఈసారి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలనుంచి కళాకారులను రప్పించి ప్రదర్శనలు ఇస్తాం.

9. రమాదేవి – హైదరాబాద్‌, లావణ్య – హైదరాబాద్‌, డా. రఘునాథరెడ్డి – హైదరాబాద్‌.

ప్రశ్న: లక్కీడిప్‌లో ఐదుసార్లు బుక్‌ చేసుకున్నాను, గడువుకు ముందే సేవలు తిరస్కరణకు గురైనట్లు వస్తోంది?

ఈ.వో. భక్తుల సూచనల మేరకు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఆర్జితసేవా టికెట్ల నమోదు సమయాన్ని 7 రోజుల నుంచి 4 రోజులకు తగ్గించాం. నగదు చెల్లించేందుకు మూడు రోజుల గడువు ఉంటుంది.

10. నాగభూషణం – విశాఖ

ప్రశ్న: శ్రీవారి ఆలయం వద్ద స్వామివారి పేరు కనిపించేలా బోర్డు పెట్టండి?

ఈ.వో. తగుచర్యలు తీసుకుంటాం.

11. శ్రీనివాసులు – పశ్చిమగోదావరి

ప్రశ్న: చంద్రగ్రహణం రోజు రద్దీ తక్కువగా ఉంది లఘు దర్శనం కల్పించి ఉంటేే బావుండేది?

ఈ.వో. అలా చేయడం సాధ్యం కాదు.

12. రాజేశ్వరరావు – సింహాచలం

ప్రశ్న: అన్నప్రసాద భవనంలో రెండోవసారి వడ్డించడం లేదు?

ఈ.వో. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం.

13. రమణారెడ్డి – గిద్దలూరు

ప్రశ్న: మాజీ సైనికోద్యోగులకు ఉద్యోగావకాశాలు ఉన్నాయా?

ఈ.వో. ప్రస్తుతం అలాంటి అవకాశాలు లేవు.

14. దత్తాత్రేయ – అనంతపురం

ప్రశ్న: హిందీలోనూ ఎస్వీబీసీ కార్యక్రమాలను ప్రసారం చేయండి ?

ఈ.వో. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ ప్రసారాలను అందిస్తున్నాం. తమిళ, కన్నడ భాషలలో పూర్తి స్థాయిలలో ప్రసారం చేశాక భక్తుల సూచనలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటాం.

15. శ్రీనివాసరావు – తెనాలి

ప్రశ్న: గ్రేడ్‌ లేని నైపుణ్యం ఉన్న కళాకారులకు నాదనీరాజనం కార్యక్రమంలో అవకాశం కల్పించండి ?

ఈ.వో. ఏ గ్రేడ్‌ లేని కళాకారులకు నాదనీరాజనంలో అవకాశం కల్పించడం సాధ్యం కాదు. ఐతే మిగిలిన వేదికలలో అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటాం.

16. శ్రీనివాస్‌ – విజయవాడ

ప్రశ్న: రథసప్తమి ఏర్పాట్లు బావున్నాయి. ఆన్‌లైన్‌ దర్శన టికెట్లతోపాటు గదులను కేటాయించివుంటే బావుండేది ?

ఈ.వో. భక్తుల రద్దీ ఉన్న సమయాలలో ఆన్‌లైన్‌లో గదుల కేటాయింపు సాధ్యం కాదు.

17. కరుణాకర్‌ – బెంగుళూరు

ప్రశ్న: సుదర్శన టోకెన్‌ పద్ధతిని పునరుద్ధరించండి?

ఈ.వో. సుదర్శన టోకెన్ల తరహాలోనే టైం స్లాట్‌ విధానాన్ని మార్చి నెల నుంచి అమలు చేస్తాం.

18. రమేష్‌ – తమిళనాడు

ప్రశ్న: తమిళనాడు నుంచి కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు దారి మధ్యలో అన్నప్రసాదాలు అందించండి?

ఈ.వో. దారి మధ్యలో అన్నప్రసాదాలను అందించడం సాధ్యం కాదు. టిటిడి చౌల్ట్రీలలో వసతులు కల్పిస్తాం.

19. శారద – మంచిర్యాల

ప్రశ్న: తిరుపతిలోని శ్రీనివాసం వసతి భవనంలో రూ.300 టికెట్ల బుకింగ్‌కు ఎక్కువ సమయం పడుతోంది?

ఈ.వో. కోటా పరిమితంగా ఉంటుంది కాబట్టి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

20. సునీల్‌ – సూర్యాపేట

ప్రశ్న: పద్మావతి విశ్రాంతి గృహంలో గదులు కావాలంటే సిఫార్సు లేఖలు అడుగుతున్నారు?

ఈ.వో. అలాంటిది ఏమి లేదు.

21. యాదగిరి – జగిత్యాల

ప్రశ్న: గోవిందమాల భక్తులకు ప్రత్యేదర్శనం కల్పించండి?

ఈ.వో. ఆన్‌లైన్‌లో రూ.300 దర్శన టికెట్లు బుక్‌ చేసుకోగలరు.

22. రామచంద్రయ్య – వళ్లూరు, కడప జిల్లా

ప్రశ్న: మా గ్రామంలో ఆలయ నిర్మాణానికి సహకారం అందించండి?

ఈ.వో. రాష్ట్ర దేవాదాయ ధార్మిక శాఖ ఆధ్వర్యంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ద్వారా టిటిడి సహకారంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ గ్రామాలలో రూ.25 కోట్లతో 500 ఆలయాల నిర్మాణం జరుగుతోంది. ఒక్కో ఆలయాన్ని రూ.5 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నాం. విగ్రహాలు, సంగీత పరికరాలు రాయితీపై అందిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అర్చక శిక్షణ ఇస్తున్నాం. మీ గ్రామంలో ఆలయ నిర్మాణానికి సంబంధించిన వివరాలను మీకు ఫోన్‌ చేసి వివరిస్తాం.

23. సందీప్‌ – భద్రాచలం

ప్రశ్న: మెట్ల మార్గం ప్రారంభంలో నాణ్యమైన పసుపు, కుంకుమ విక్రయించేలా చర్యలు తీసుకోండి?

ఈ.వో. అధికారుల ద్వారా తగు చర్యలు తీసుకుంటాం.

24. విజయశంకర్‌ – కర్నూలు

ప్రశ్న: తిరుమలలో ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వరకు రవాణా వసతి కల్పించండి?

ఈ.వో. తగిన చర్యలు తీసుకుంటాం.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్‌వో శ్రీ ఎ.రవికృష్ణ, ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, విఎస్‌వోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మీ, డిప్యూటీ ఈవోలు శ్రీ ఈసీ శ్రీధర్‌, శ్రీమతి నాగరత్న, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, కేటరింగ్‌ అధికారి శ్రీజిఎల్‌ఎన్‌ శాస్త్రీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.