INVITATION POSTERS FOR HIMAYATNAGAR SV TEMPLE BRAHMOTSAVAMS RELEASED _ హిమయత్‌నగర్‌లో శ్రీనివాసుని బ్రహ్మోత్సవ వైభవానికి ఘన శ్రీకారం

Tirumala, June 02, 2026: TTD Chairman Sri B.R. Naidu released the invitation and wall posters for the 21st Annual Brahmotsavams of Sri Venkateswara Swamy Temple, Himayatnagar, Hyderabad.

The Brahmotsavams will be held from June 19 to 24, commencing with Ankurarpanam on June 19 and Dhwajarohanam on June 20.

Major events include Sesha, Hanumantha, Suryaprabha, Chandraprabha, Gaja, Garuda and Aswa Vahana Sevas, besides Shanthi Kalyanam, Rathotsavam, Chakrasnanam and Pushpayagam.

The Chairman instructed officials to make elaborate arrangements, including drinking water, shelters and illumination, for the convenience of devotees.

Annadanam and cultural programmes will be conducted throughout the festival.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హిమయత్‌నగర్‌లో శ్రీనివాసుని బ్రహ్మోత్సవ వైభవానికి ఘన శ్రీకారం

జూన్ 19 నుండి 24 వరకు దివ్య వాహనసేవలతో భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం

తిరుమల, 2026 జూన్ 02: హైదరాబాద్ హిమయత్‌నగర్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం 21వ వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు, గోడ పత్రికలను టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని ఛైర్మన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

జూన్ 19 నుండి 24 వరకు బ్రహ్మోత్సవ మహోత్సవాలు అంకురార్పణతో ప్రారంభం – ధ్వజావరోహణంతో ముగింపు

జూన్ 19వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. జూన్ 20న కర్కాటక లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, తాగునీటి సదుపాయం, విద్యుద్దీపాల అలంకరణలు ఏర్పాటు చేయాలని ఛైర్మన్ సూచించారు.

వాహనసేవల విశేషాలు

 జూన్ 20 – ఉదయం శేష వాహనం, రాత్రి హనుమంత వాహనం

 జూన్ 21 – ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం

 జూన్ 22 – ఉదయం గజ వాహనం, ఉదయం శాంతి కల్యాణం, రాత్రి గరుడ వాహనం

జూన్ 23 – ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం

చక్రస్నానం – పుష్పయాగంతో ఆధ్యాత్మిక పరవశం

జూన్ 24న ఉదయం స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించనున్నారు. సాయంత్రం పుష్పయాగం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు సంపూర్ణం కానున్నాయి.

అన్నప్రసాద వితరణ – సాంస్కృతిక కార్యక్రమాలు

బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్నప్రసాద వితరణ జరగనుండగా, భక్తులను అలరించే ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఎల్.ఏ.సీ. అధ్యక్షులు శ్రీ శంకర్ గౌడ్, టెంపుల్ ఏఈవో శ్రీ యు. రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ మణికంఠ, వేద పారాయణదారులు, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది