ISSUANCE OF ANNAPRASADAM TOKENS THROUGH POS MACHINE _ పిఓఎస్ యంత్రం ద్వారా అన్నప్రసాదం టోకెన్ల జారీ
Tirupati, 06 March 2024: TTD JEO Sri Veerabraham on Wednesday started the issuance of tokens through the PoS machine for distribution of Annaprasadam.
The distribution of free Annaprasadam at Sri Govindaraja Swamy temple in Tirupati has started last week by TTD.
These machines have been installed under the auspices of the IT department of TTD to issue about 2000 per day to devotees.
FACAO Sri. Balaji, IT GM Sri. LM. Sandeep and others participated in this program.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
పిఓఎస్ యంత్రం ద్వారా అన్నప్రసాదం టోకెన్ల జారీ
మార్చి 06, తిరుపతి, 2024: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉచిత అన్నప్రసాద వితరణ గత వారం నుండి ప్రారంభమైంది.
అన్నప్రసాద వితరణ కోసం పిఓఎస్ యంత్రం ద్వారా టోకెన్ల జారీని బుధవారం టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం ప్రారంభించారు. టీటీడీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో ఈ యంత్రాలను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలోఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజి, ఐటీ జిఎం శ్రీ ఎల్ఎం.సందీప్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.