IVF LAB INAUGURATED AT VET VARSITY BY TTD CHAIRMAN _ పశువైద్య విశ్వవిద్యాలయం లో ఐ వి ఎఫ్ ల్యాబొరేటరీ ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్, ఈవో

TIRUPATI, 16 FEBRUARY 2022: TTD Chairman Sri YV Subba Reddy on Wednesday inaugurated the newly constructed In Vitro Fertilization (IVF) laboratory in SV Veterinary University at Tirupati.

 

Speaking on the occasion, the Chairman said, TTD has allotted Rs.3.80crore towards setting up this lab. The aim behind this is to increase the milk produced from the indigenous cows and enhance the preparation of prasadams in Govinduniki Goadharita Naivedyam – the prestigious program commenced by TTD last May. Every day TTD required 3000 liters of milk. At present we are receiving only 500 liters of milk. To meet our requirements we need to improve the milk produced from the desi cows. “Through this embryo technology, we can improve the milk produced in desi breeds. This will help to increase the milk production per cow from the present 5-6litres to 10 liters. This would help TTD to continue the Goadharita Naivedyam programme forever”, he added.

 

EO Dr. KS Jawahar Reddy, JEO Sri Veerabrahmam, Veterinary University VC Sri Padmanabha Reddy, SVIMS Director Dr. Vengamma, and others were present. Earlier they visited the lab and were briefed on its mode of functioning.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

పశువైద్య విశ్వవిద్యాలయం లో ఐ వి ఎఫ్ ల్యాబొరేటరీ ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్, ఈవో

తిరుపతి 16 ఫిబ్రవరి 2022: టీటీడీ గోశాలల్లో దేశీయ గో జాతుల అభివృద్ధికి పిండ మార్పిడి, టీటీడీ అవసరాలకు దేశీయ గోవుల పాలఉత్పత్తి పెంచేందుకు ఉద్దేశించిన
ఐవిఎఫ్ ల్యాబ్ ను బుధవారం సాయంత్రం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ప్రారంభించారు.

శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, టీటీడీ గోశాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా పశువైద్య విశ్వవిద్యాలయం లో రూ 3.80 కోట్ల టీటీడీ నిధులతో ఈ ల్యాబ్ ఏర్పాటు చేశారు.

వీర్య సేకరణ, పిండ అభివృద్ధి, వాటిని సాంకేతికంగా గోవుల అండం లో ప్రవేశ పెట్టే విధానాన్నిచైర్మన్, ఈవో పరిశీలించారు.

దేశవాళీ గో సంతతి అభివృద్ధి కోసమే…టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
ఐ వి ఎఫ్ ల్యాబొరేటరీ ప్రారంభించిన అనంతరం టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.

తిరుమల శ్రీవారికి గో ఆధారిత నైవేద్యం తయారీ కోసం అవ‌స‌ర‌మైన పాల ఉత్పత్తి, నెయ్యి త‌యారు చేయ‌డానికి, దేశ‌వాళి గో జాతుల అభివృద్ధికి ఎస్వీ ప‌శు వైద్య విశ్వ‌విద్యాల‌యంతో టీటీడీ గో సంరక్షణ శాల ఎంఓయు కుదుర్చుకుందని ఆయన తెలిపారు.

శ్రీ‌వారి ఆల‌యంలో ప్ర‌తి రోజు 60 లీట‌ర్ల నెయ్యి అవ‌స‌రం అవుతుందని చెప్పారు. ఇందులో 30 లీట‌ర్లు స్వామివారి ప్రసాదాల తయారీకి, 30 లీట‌ర్లు దీపారాధ‌న‌కు వినియోగిస్తారని ఆయన తెలిపారు. ఇందుకోసం దేశవాళీ ఆవు పాల నుండి నెయ్యి త‌యారు చేయ‌డానికి ప‌శు వైద్య విశ్వ‌విద్యాల‌యం త‌గిన సాంకేతిక స‌హ‌కారం అందిస్తోందన్నారు.

దేశ వాళీ గో జాతుల అభివృద్ధి కోసం పిండ మార్పిడి ప‌థకం (Embryo transfer) కోసం ఎస్వీ ప‌శు వైద్య విశ్వ‌విద్యాల‌యంతో ఎంఓయు కుదుర్చుకున్నామని ఛైర్మన్ వివరించారు. ప‌శు వైద్య విశ్వ‌విద్యాల‌యం డాక్ట‌ర్లు గో సంర‌క్ష‌ణ‌శాల‌లోని ఆవుల‌న్నింటినీ ప‌రీక్షించి వాటిలో పిండోత్ప‌త్తికి, అధిక పాల ఉత్ప‌త్తికి త‌గిన సాంకేతిక సహకారం అందిస్తారన్నారు.

తిరుప‌తి, ప‌ల‌మ‌నేరు గోశాలల్లోని గోవుల‌కు జ‌న్యుప‌రంగా (High gentic merit) ఉన్న‌త‌ ల‌క్ష‌ణాలు ఉన్న ఆవు దూడ‌ల‌ను పుట్టించి, పాల ఉత్ప‌త్తి పెంచే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు.

ఇందులో భాగంగా పశువైద్య విశ్వవిద్యాలయం లో ఐ వి ఎఫ్ ల్యాబ్ ఏర్పాటుకు ఎస్వీ గో సంరక్షణ ట్రస్ట్ నుండి 3.80 కోట్లు అందించేందుకు టీటీడీ ఒప్పందం చేసుకుందన్నారు.

ఈ ల్యాబ్ ఏర్పాటు వల్ల దేశవాళీ గో జాతుల సంతతి అభివృద్ధి జరుగుతుందని శ్రీ సుబ్బారెడ్డి అన్నారు. టీటీడీ అవసరాలకు రోజుకు 3 వేల లీటర్ల పాలు అవసరం అవుతాయని, గోశాలల ద్వారా ఇప్పుడు రోజుకు 500 లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తి చేసుకోగలుగుతున్నామన్నారు. పిండ మార్పిడి సాంకేతిక పద్ధతి ద్వారా దేశీయ ఆవుల ఉత్పత్తిని పెంచడంతో పాటు, ఒక ఆవు రోజుకు 10 లీటర్ల పాలు ఇచ్చే రకంగా తయారు అవుతాయని చెప్పారు. త్వరలోనే ఈ కార్యక్రమం పూర్తి చేసి తిరుమల శ్రీవారి కి దేశవాళీ గోవుల పాలు, నెయ్యి, గోఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో ప్రసాదాలు తయారు చేసే విధానం శాశ్వతంగా అమలు జరిపేందుకు మార్గం సుగమం అవుతుందని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు.

జెఈవో శ్రీ వీర బ్రహ్మం, పశువైద్య విశ్వవిద్యాలయం విసి ప్రొఫెసర్ పద్మనాభరెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, టీటీడీ గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, పశువైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రవి, డీన్ డాక్టర్ సర్జన్ రావు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది