IVTH DAY OF SRI GOVINDARAJA SWAMY FLOAT FESTIVAL_ తెప్పపై శ్రీ ఆండాళ్ సమేత శ్రీకృష్ణస్వామివారి కనువిందు
Tirupati, 28 January 2018: As part of ongoing Seven days Sri Govindaraja Swamy Temple Annual Float Festival, the fourth day is dedicated to the idols of Lord Sri Krishna Swamy along with Goddess Andal. The idols were taken out in procession from Sri Govindaraja Swamy Temple to Sri Vari Pushkarni situated near the Temple on Sunday evening.
Among others the DyEO Smt P Varalakshmi, AEO Sri Uday Bhaskar Reddy, Suptd Sri Dyanaprakash, Temple Inspector Sri Krishnamurthy and other TTD officials participated.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
తెప్పపై శ్రీ ఆండాళ్ సమేత శ్రీకృష్ణస్వామివారి కనువిందు
తిరుపతి, 2018 జనవరి 28: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం స్వామివారు ఆండాళ్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి 6.30 నుండి 8.00 గంటల వరకు స్వామివారు ఉభయదేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేస్తారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.
స్వామివారు మొత్తం ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. అదేవిధంగా సోమవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి పి.వరలక్ష్మి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీజ్ఞానప్రకాష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.