JAGADABHI RAMA SHINES ON BHAKTA HANUMAN _ హనుమంత వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల విహారం
హనుమంత వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల విహారం
ఒంటిమిట్ట, 2024 ఏప్రిల్ 20: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం రాత్రి విశేషమైన హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది.
శ్రీ సీతారామలక్ష్మణులు ప్రియభక్తుడైన హనుమంత వాహనాన్ని అధిరోహించి పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి దర్శించుకున్నారు.
త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వారు హనుమంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం ద్వారా తెలుస్తోంది. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నారు. దాసభక్తికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతున్నారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈఓలు శ్రీ నటేష్ బాబు, శ్రీ శివ శంకర్, సూపరింటెండెంట్
శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
VONTIMITTA, 20 APRIL 2024: As part of the ongoing annual Brahmotsavam in Vontimitta, on Saturday evening Sri Rama in all His religious splendour took out a celestial ride on His favorite Hanumanta Vahana to bless the devotees.
Among all the carriers of the Lord, the privilege of being worshipped as Lord on par with Master refers only to Hanuman for His quintessential qualities of bravery, majesty and above all Loyalty towards His Master. These qualities are role models for every human being.
DyEO Sri Natesh Babu and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI