JAGANMOHANAKARA CASTS SPELL AS MOHINI _ మోహినీ అలంకారంలో జగన్మోహనుడు

Vontimitta, 21 April 2024: The fifth day on Sunday witnessed Sri Ramachandra Murty in the most versatile Universal Damsel Mohini Alankaram.

As a part of the ongoing annual Brahmotsavams, Sri Rama cast His magical spell in the splendid Mohini Alankaram.

The devotees were found immersed in devotional waves on seeing the eternal beauty as Jaganmohini.

Superintendent Sri Hanumantaiah, Temple Inspector Sri Naveen and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మోహినీ అలంకారంలో జగన్మోహనుడు

ఒంటిమిట్ట, 2024 ఏప్రిల్ 21: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం ఉదయం మోహినీ అలంకారంలో రాములవారు జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చారు.

ఉదయం 7.30 గంటలకు స్వామివారి ఊరేగింపు వైభవంగా ప్రారంభమైంది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

మోహినీ అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణింపబడింది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది. దానిని పంచుకోవడంలో కలహం ఏర్పడుతుంది. ఆ కలహాన్ని నివారించి, దేవతలకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరిస్తాడు. తనకు భక్తులు కానివారు ఆ మాయలో ఉంటారనీ తనకు ప్రసన్నులైనవారు మాయను సులభంగా దాటగలరనీ ఈ మోహినీ రూపంలో రాములవారు ప్రకటిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ నటేష్ బాబు, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.