JAYA MANTRA ECHOS AT VASANTHA MANDAPAM _ జ‌య మంత్రంతో వెలుగొందిన వ‌సంత మండ‌పం

Tirumala, 13 May 2021: On the 11th day of the ongoing Shodasha Dina Sundarakanda Diksha organised by the TTD for the well-being of humanity, the Jaya mantra parayanam resounded at the Vasantha Mandapam, Tirumala on Thursday morning.

The Vedic pundits of TTD performed the parayanam of 278 shlokas of 38- 45 sargas of holy Sundarakanda beginning with the ‘ Da ‘word followed up with Sri Rama Prarthana, Sri Anjaneya Prarthana and Sri Valmik Prarthana. On Friday the pundits will chant 178 shlokas of 48-50 sargas.

Principal of Dharmagiri Veda Pathashala Sri KSS Avadhani highlighted the significance of today’s shlokas as a narrative of the Anjaneya battle at Ashoka Vana at Sri Lanka after meeting Sitadevi.

The Diksha parayanams were live telecast by SVBC daily from 8.30 am onwards for benefit of Srivari devotees across the globe.

TTD Additional EO Sri AV Dharma Reddy and his spouse, SVBC CEO Sri Suresh Kumar, Health Officer Sri RR Reddy, OSD of Sri Venkateswara higher Vedic studies institute Dr Akella Vibhishana Sharma and others were present.

 AT DHARMAGIRI VEDA VIJNAN PEETHAM

 Similarly, about 10 rutwiks led by Acharya Sri K Shiv Subramanya Avadhani performed Rohini Nakshatra yagam aimed to beget longtime health for all.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జ‌య మంత్రంతో వెలుగొందిన వ‌సంత మండ‌పం

తిరుమల, 2021 మే 13: లోక సంక్షేమం కోసం శ్రీ‌వారిని ప్రార్థిస్తూ వ‌సంత మండ‌పంలో నిర్వ‌హిస్తున్న‌ షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష‌లో భాగంగా 11వ రోజైన గురువారం ఉద‌యం హ‌నుమంతుని జ‌య మంత్రంతో వ‌సంత మండ‌పం ప్ర‌తి ధ్వ‌నించింది. ఇందులో భాగంగా 38వ‌ స‌ర్గ నుండి 45వ‌ స‌ర్గ వ‌ర‌కు ఉన్న 278 శ్లోకాల‌ను వేద శాస్త్ర‌ పండితులు అత్యంత దీక్షా శ్రద్ధలతో పారాయ‌ణం చేశారు.

షోడ‌షాక్ష‌రి మ‌హామంత్రం ప్ర‌కారం 11వ‌ రోజు ద‌ అనే అక్ష‌రానికి ఉన్న బీజాక్ష‌రాల ప్ర‌కారం సుంద‌ర‌కాండ‌లోని 278 శ్లోకాల‌ను పారాయ‌ణం చేశారు. ఇందులో భాగంగా మొద‌ట సంక‌ల్పంతో ప్రారంభించి శ్రీ‌రామ ప్రార్థ‌న‌, శ్రీ ఆంజ‌నేయ ప్రార్థ‌న‌, శ్రీ వాల్మీకి ప్రార్థ‌న చేశారు. శుక్ర‌వారం నాడు 46వ‌ స‌ర్గ నుండి 50వ‌ స‌ర్గ వ‌రకు మొత్తం 178 శ్లోకాల‌ను పారాయ‌ణం చేయ‌నున్నారు.

ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల ప్రిన్సిపాల్ ఆచార్య కుప్పా శివ‌సుబ్ర‌హ్మ‌ణ్య అవ‌ధాని మాట్లాడుతూ ఆంజ‌నేయ‌స్వామివారు లంక న‌గ‌రంలో అశోకవ‌నంలో సీత‌మ్మ‌వారిని చూసి, మాట్టాడిన త‌రువాత అశోక‌వ‌నాన్ని ధ్వంసం చేశార‌న్నారు. దాదాపు 80 వేల మందికి పైగా రాక్ష‌సుల‌ను సంహారించార‌ని, అదేవిధంగా ఆంజ‌నేయ‌స్వామివారు ప్ర‌జ‌ల‌కు ఆయురారోగ్యాల‌ను ప్ర‌సాదిస్తార‌ని వివ‌రించారు.

ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల కోసం ప్ర‌తిరోజూ ఉద‌యం 8.30 గంట‌ల నుండి ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, ఎస్వీబిసీ సిఈవో శ్రీ సురేష్‌కుమార్‌, ఆరోగ్య‌శాఖాధికారి డా.ఆర్ఆర్‌.రెడ్డి, ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ, త‌దిత‌రులు పాల్గొన్నారు.

ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం :

అదేవిధంగా ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠంలో ఆచార్య కుప్పా శివ‌సుబ్ర‌హ్మ‌ణ్య అవ‌ధాని ఆధ్వ‌ర్యంలో 10 మంది రుత్వికులు రోహిణి న‌క్ష‌త్ర యాగం నిర్వ‌హించారు. ఈ యాగం వ‌ల‌న రోహిణి న‌క్ష‌త్రానికి అదిదేవ‌త అయిన ప్ర‌జాప‌తి అనుగ్ర‌హించి ప్ర‌తి మ‌నిషి 100 శ‌ర‌త్ రుతువులు ( 100 సంవ‌త్స‌రాలు) జీవించి ఉండేలా అనుగ్ర‌హిస్తార‌ని వేద పండితులు తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.