JAYATEERTHA LITERATURE AIMED AT ENHANCING THE POPULARITY OF LORD-HH SRI SRI SRI VIDYA VALLABHA THEERTHA_ జయతీర్థుల సాహిత్యంతో శ్రీవారి వైభవం వ్యాప్తి : శ్రీశ్రీశ్రీ విద్యావల్లభతీర్థ స్వామీజీ

Tirupati, 1 August 2018: The literary works by Sri Jayatheertha spread the popularity of Lord Venkateswara across Karnataka said, HH Sri Vidya Vallabha Theertha Swami of Kanyur Mutt in Udipi.

During his religious address on the occasion of the Aradhana Mahotsavams of Sri Jayatheertha at Kalyana Vedika in Tirumala on Wednesday, Sri Vidyavallabha Swamy said, the easiest way to attain salvation in Kaliyuga is through the chanting of the divine names of Lord by the way of bhajans or sankeertans.

Dasa Sahitya Project Special Officer Sri PR Ananda Theerthacharya was also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జయతీర్థుల సాహిత్యంతో శ్రీవారి వైభవం వ్యాప్తి : శ్రీశ్రీశ్రీ విద్యావల్లభతీర్థ స్వామీజీ

ఆగస్టు 01, తిరుమల 2018: శ్రీ జయతీర్థులవారు తన సాహిత్యం ద్వారా శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేసేందుకు విశేషంగా కృషి చేశారని ఉడిపిలోని కాణ్యూర్‌ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యావల్లభతీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమలలోని కళ్యాణవేదికపై శ్రీ జయతీర్థుల ఆరాధనోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ విద్యావల్లభతీర్థ స్వామీజీ మంగళశాసనాలు చేస్తూ జయతీర్థుల వారి సాహిత్యాన్ని శ్రీ పురందరదాసులవారు గ్రహించి అపారమైన సంకీర్తనలు రచించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరించాలని, కష్టకాలంలో ఆ ధర్మమే తిరిగి మనల్ని రక్షిస్తుందని పేర్కొన్నారు. భక్తిమార్గంతోనే మానవులకు మనశ్శాంతి చేకూరుతుందన్నారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో ప్రసన్నమూర్తి అయిన శ్రీవారిని సేవిస్తే శాంతస్వభావం అలవడుతుందని వివరించారు.

ఆరాధనోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతం, ధ్యానం, శ్రీజయతీర్ధుల సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం సామూహిక సంకీర్తనాలాపన, సంగీత విభావరి చేపట్టారు. ఆగస్టు 2న బెంగళూరులోని శ్రీరాఘవేంద్ర మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సువిద్యేంద్రతీర్థ స్వామీజీ, ఆగస్టు 3న ఉడిపిలోని తీర్థహళ్లి, భీమసేతు మునివృంద మఠాధిపతి శ్రీశ్రీశ్రీ రఘువరేంద్రతీర్థ స్వామీజీ మంగళాశాసనాలు చేస్తారు.

టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మూడు వేల మందికి పైగా భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.