TTD PUBLICATIONS CLOSER TO DEVOTEES- JEO_ భక్తులకు మరింత విస్తృతంగా టిటిడి ప్రచురణలు – టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

Tirupati, 13 Jun. 19: TTD Joint Executive Officer in Tirupati Sri B Lakshmi Kantham Today directed officials to take TTD publications closer to devotees.

Speaking after a review meeting with senior officials at TTD administrative building on Thursday morning the JEO said a publication committee has been set up under the chairmanship of SVETA Director to explore prospects of making all TTD publications more attractive and popular among devotees and readers.

He directed officials to maintain separate registers in the TTD local temples also for Padi kavali, donors, and jewels and make frequent entries. All such temples also should send officials on deputations for Parakamani duty at Tirumala in order to conduct Parakamani in their temples also future. He also asked officials to complete all ongoing civil and electrical development works on a war footing.

He applauded the Chief editor of Saptagiri magazine Sri Radha Raman for improving the circulation from 1.1 lakhs to 2 lakhs and urged him to take it greater heights. He wanted DyEO of Publication division to undertake all steps to bring out TTD calendars and diaries in time this year also and also coordinate with Indian Posts for online booking for lakhs of devotees.

The JEO also directed officials to speed up all pending and ongoing developmental works in the TTD employees quarters to facilitate TTD employees.

Heads of all TTD departments participated in the review meeting.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తులకు మరింత విస్తృతంగా టిటిడి ప్రచురణలు – టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

జూన్‌ 13, తిరుపతి, 2019: టిటిడి ప్రచురణలను మరింత విస్తృతంగా పాఠకులకు అందుబాటులో ఉంచాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో గురువారం జెఈవో, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా జెఈవో మాట్లాడుతూ ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో టిటిడి గ్రంథాలను ముద్రించి, పాఠకులకు విస్తృతంగా అందించేందుకు శ్వేత సంచాలకులు శ్రీ ముక్తేశ్వరరావు అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భారత, భాగవత రామాయణాలకు ఎంతో ప్రాశస్త్యం ఉందన్నారు. టిటిడి ప్రచురణలకు మంచి ఆదరణ ఉందని, అదే స్థాయిలో పాఠకులకు మరిన్ని మంచి పుస్తకాలను ముద్రించేందుకు వీలుగా ఈ పబ్లికేషన్‌ కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

టిటిడి స్థానిక ఆలయాలలో పడికావిలి, దాతల విభాగం, తిరువాభరణం, సదాసమర్పణ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. తిరుమలతో పాటు టిటిడి అనుబంధ ఆలయాలలో పరకామణి నిర్వహించేందుకు వీలుగా సిబ్బందిని డిప్యూటేషన్‌పై నియమించాలని, అదేవిధంగా పరకామణి సేవకులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. టిటిడి స్థానిక ఆలయాలో జరుగుతున్న సివిల్‌, ఎలక్ట్రికల్‌ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

సస్తగిరి మాసపత్రిక పాఠకులను 1.1 లక్షల నుండి 2 లక్షలకు తీసుకు వెళ్లెందుకు కృషి చేసిన సప్తగిరి ప్రధాన సంపాదకులు శ్రీ రాధరమణను అభినందిస్తూ, ఆ సంఖ్యను మరింత పెంచడానికి కృషి చేయాలన్నారు. టిటిడి డైరీలు, క్యాలెండర్లు సకాలంలో ముద్రించడానికి అవసరమైన ముందస్తు చర్యలు తీసుకొవాలని ప్రచురణల విభాగం డెప్యూటీ ఈవోను ఆదేశించారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పోస్టల్‌ డిపార్టుమెంట్‌తో సమన్వయం చేసుకుని ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే లక్షలాది మంది భక్తులకు డైరీలు, క్యాలెండర్లు పంపిణీ చేయాలని ప్రచురణల విక్రయ విభాగం డెప్యూటీ ఈవోను ఆదేశించారు. టిటిడి ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా టిటిడి క్వార్టర్స్‌లలో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో టిటిడి అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.