JEO AND JC INSPECT SRI SITA RAMA KALYANAM ARRANGEMENTS _ రాములవారి కల్యాణోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో
VONTIMITTA, 31 MARCH 2023: TTD JEO Sri Veerabrahmam along with Joint Collector of YSR Kadapa district Sri Saikant Verma on Friday inspected the arrangements done for the ensuing State Festival of Sri Sita Rama Kalyanam on April 5 in view of the visit of the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy on the auspicious day.
As part of the inspection, the JEO and JC visited the temple and verified the route map of CM’s visit to the temple and the CM’s rest house before starting for Kalyana Vedika to take part in the celestial Kalyanam.
Later the JEO and JC inspected the Kalyana Vedika and verified the galleries, rest rooms, control room and other arrangements that are being done for the big day on April 05.
All deputation officers from TTD and district administration were also present.
రాములవారి కల్యాణోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో
తిరుపతి, 2023 మార్చి 31: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 5న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవం రోజున భక్తుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లను టీటీడీ జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, వైఎస్సార్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ సాయికాంత్ వర్మ శుక్రవారం పరిశీలించారు.
ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్ మోహన్ రెడ్డి కల్యాణోత్సవం రోజున పట్టువస్త్రాల సమర్పణకు వచ్చినప్పుడు ఆలయంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో జెఈవో చర్చించారు. అనంతరం కల్యాణవేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. గ్యాలరీల్లో భక్తులకు కల్పించాల్సిన వసతులు ఇతర ఏర్పాట్లపై జిల్లా అధికారులతో చర్చించారు. అనంతరం వైఎస్సార్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ జిల్లా డెప్యుటేషన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆలయం వద్దగల పరిపాలన భవనంలో జెఈవో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జెఈవో వెంట ఎస్ఇ(ఎలక్ట్రికల్స్) శ్రీ వెంకటేశ్వర్లు, డిఇ శ్రీ చంద్రశేఖర్, ఇఇ శ్రీమతి సుమతి, డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాస్, డెప్యూటీ ఈవోలు శ్రీ గుణభూషణ్ రెడ్డి, శ్రీ నటేష్ బాబు, శ్రీ శివప్రసాద్, శ్రీ సుబ్రహ్మణ్యం, అదనపు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సునీల్ కుమార్ ఇతర అధికారులు ఉన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.