JEO BHASKAR UNVEILS BTU WALLPOSTERS OF TTD LOCAL TEMPLES _ టిటిడి స్థానికాలయాల బ్రహ్మోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ
Tirupathi, 18 May 2018 : The wall posters of annual Brahmotsavams of several TTD sub temples were today released by Sri Pola Bhaskar,JEO(Tirupati) at his chambers in the TTD administrative building.
The annual Brahmotsavams were slated at the Sri Kalyana Venkateswara temple ,Narayanavanam , Sri Kari Manikyaswami temple, Tummuru,( Nellore district).
Speaking on the ocassion Sri Bhaskar said the Brahmotsavam of Sri Kalyana Venkateswara temple, Narayanavanam will begin from May 27 to June 4 .The main events of the annual festival would be Dwajarohanam on May 27, Garuda Seva on May 31, Rathotsavam and Kalyanotsavam on June 3, and Chakrasnanam on June 4.
Similarly the Brahmotsavam of Sri Kari Manikyaswami temple will begin from May 27 to June 5 with Dwajarohanam on May 27,Garuda Seva on May 29,Kalyanotsavam on June 1, Rathotsavam on June 2, Dwajaavarohanam on June 4 and Pushpayagam on June 5th.
Among others TTD local temples Dy EO’s Smt Varalakshmi, and Smt Jhansi ,AEO Sri Tirupataiah, and other officials participated.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి స్థానికాలయాల బ్రహ్మోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ
మే 18, తిరుపతి, 2018 ; టిటిడికి అనుబంధంగా ఉన్న నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరులోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కరిమాణిక్యస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల గోడపత్రికలు, కరపత్రాలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు మే 27 నుండి జూన్ 4వ తేదీ వరకు జరుగనున్నాయని తెలిపారు. ఇందులో ప్రధానంగా మే 27న ధ్వజారోహణం, మే 31న న గరుడసేవ, జూన్ 3న ఉదయం రథోత్సవం, రాత్రి కల్యాణోత్సవం, జూన్ 4న చక్రస్నానం, ధ్వజావరోహణం జరుగనున్నట్టు వివరించారు.
అదేవిధంగా, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కరిమాణిక్యస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు మే 27 నుండి జూన్ 5వ తేదీ వరకు జరుగనున్నాయని జెఈవో తెలిపారు. ఇందులో ప్రధానంగా మే 27న ధ్వజారోహణం, మే 29న గరుడసేవ, జూన్ 1న కల్యాణోత్సవం, జూన్ 2న రథోత్సవం, జూన్ 4న ధ్వజావరోహణం, జూన్ 5న పుష్పయాగం జరుగనున్నట్టు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవోలు శ్రీమతివరలక్ష్మి, శ్రీమతి ఝాన్సీ, ఏఈవో శ్రీ తిరుపతయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.