JEO BRIEFS ON VARIOUS TTD ACTIVITIES TO TRAINEE IAS_ ట్రైనీ ఐఏఎస్‌లకు టిటిడి కార్యకలాపాలపై అవగాహన

Tirupati, 8 January 2018: Tirupati JEO Sri P Bhaskar on Monday explained about various activities taken up by TTD in the larger interests of pilgrim public to a 16-member trainee IAS batch.

The programme was held in SPRH in Tirupati. The JEO briefed them on Annaprasadam, Kalyanakatta, various IT initiative programmes recently introduced by TTD to enhance transparency in its services of darshan, accommodation, laddu prasadam distribution, e-Donation, e-Hundi etc.

In this programme, DyEO Smt Goutami, SO Annaprasadam Sri Venugopal, HDPP Secretary Sri Ramakrishna Reddy and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ట్రైనీ ఐఏఎస్‌లకు టిటిడి కార్యకలాపాలపై అవగాహన

తిరుపతి, 2018 జనవరి 08: టిటిడి కార్యకలాపాలపై 16 మంది శిక్షణ ఐఏఎస్‌లకు తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ సోమవారం అవగాహన కల్పించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి అమలుచేస్తున్న ఆధ్యాత్మిక, ధార్మిక, విద్య, వైద్య, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. టెక్నాలజీ సాయంతో పారదర్శకంగా భక్తులకు అందిస్తున్న సేవలు, లడ్డూ ప్రసాదాల పంపిణీ, వసతి, దివ్యదర్శనం టైంస్లాట్‌, త్వరలో ప్రవేశపెట్టనున్న సర్వదర్శనం టైంస్లాట్‌, ఆన్‌లైన్‌ సేవలు, ఈ-డొనేషన్‌, ఈ-హుండీ, క్యూలైన్ల నిర్వహణ, ఆర్వో వాటర్‌ ప్లాంట్లు, వైద్యసేవలు, అన్నప్రసాదాల వితరణ, తయారీ, వంటలకు సరిపడా సరుకుల నిల్వ, సేకరణ, పారిశుద్ధ్యం, ప్రహరీ ఉద్యానవనాలు, రవాణా, టిటిడి స్థానికాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, టిటిడిలో పరిపాలన క్రమశ్రేణి, అధికారుల బాధ్యతలు, సిబ్బంది పనితీరు తదితర అంశాలను వారికి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీమతి గౌతమి, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, హెచ్‌డిపిపి కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ప్రాజెక్టు అధికారి డా|| ఆర్‌.రమణప్రసాద్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.