JEO GIVES PRACTICAL NARRATION TO MEDIA_ శ్రీవారి ఆలయంలో క్యూలైన్లపై మీడియా ప్రతినిధులకు అవగాహన కల్పించిన జెఈవో

Tirumala, 7 July 2017: Over the instructions of TTD EO Sri AK Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju has given practical narration to media persons in Tirumala temple about the recent pilgrim friendly amendments ensured by TTD.

Tirumala media were taken to the temple and were shown the recent changes in queue lines brought at vendivakili to avoid jostling of pilgrims with separate in and out lines, changes brought at Hindi by JEO.

Later the media persons had darshan of Lord Venkateswara.

CVSO Sri Ravi Krishna, TTD PRO Dr T Ravi was also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో క్యూలైన్లపై మీడియా ప్రతినిధులకు అవగాహన కల్పించిన జెఈవో

జూలై 07, తిరుమల, 2017 : శ్రీవారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఇటీవల మార్పుచేసిన క్యూలైన్లపై మీడియా ప్రతినిధులకు శుక్రవారం టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు అవగాహన కల్పించారు.

మహద్వారం నుంచి వెండి వాకిలి వరకు చేపట్టిన మార్పులను వివరించారు. వెండి వాకిలి నుంచి బంగారువాకిలి వద్దకు వెళ్లేందుకు ఒక క్యూలైన్‌, దర్శనానంతరం వెండి వాకిలి వద్ద తిరిగి వెలుపలికి వచ్చేందుకు మరో క్యూలైన్‌ ఏర్పాటు చేయడం వల్ల భక్తులు ఎలాంటి ఒత్తిడి లేకుండా సాఫీగా రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. వకుళామాత సన్నిధి వద్ద ఏర్పాటుచేసిన క్యూలైన్‌, రెండు వరుసల్లో తీర్థం ఇచ్చేందుకు చేసిన ఏర్పాట్లపై అవగాహన కల్పించారు.

జెఈవో వెంట సివిఎస్‌వో శ్రీ ఎ.రవికృష్ణ, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఏఈవో శ్రీ లోకనాథం, ఎవిఎస్‌వో శ్రీ కూర్మారావు ఇతర అధికారులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.