JEO H & E REVIEWS ON KARTHIKA DEEPOTSAVAM ARRANGEMENTS _ కార్తీక దీపోత్సవం పై జెఈఓ సమీక్ష
Tirupati, 21 Nov. 20: The JEO for Health and Education Smt Sada Bhargavi on Saturday evening reviewed on the arrangements for Karthika Deepotsavam which is scheduled to be observed in Tirupati on November 30.
This Festival of Lights being observed by TTD for the first time in Tirupati where in the women employees take part in this massive Deepotsavam.
JEO H and E along with heads of various departments reviewed and inspected the ongoing arrangements.
She instructed the Engineering, SVBC, cultural, publication, Vigilance officials to complete the arrangements by November 25. While the floral decorations by Garden wing to be completed by the afternoon of November 30.
Separate passes for five different entry points will be issued to the women taking part in the fete.
CEO SVBC Sri Suresh Kumar, SE 1 Sri Jagadeeshwar Reddy, SE Electrical Sri Venkateswarulu, Additional HO Dr Sunil Kumar, Annamacharya Project Director Sri Dakshinamurthy, VGO Sri Manohar, RSVP scholar Sri Rani Sada Sivamurthy were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
కార్తీక దీపోత్సవం పై జెఈఓ సమీక్ష
తిరుపతి, 21నవంబరు 2020: టీటీడీ తొలిసారి ఈ నెల 30వ తేదీ తిరుపతి పరిపాలన భవనం ప్రాంగణంలోని గ్రౌండ్ లో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవం ఏర్పాట్ల పై జె ఈ ఓ (విద్య, వైద్యం) శ్రీమతి సదా భార్గవి శనివారం సాయంత్రం అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం గ్రౌండ్ లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.టీటీడీ తొలిసారి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులంతా పాల్గొని విజయవంతం చేసేలా విభాగాధిపతులందరూ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎస్వీబీసీ, ఇంజినీరింగ్, విజిలెన్స్, విద్యుత్, పబ్లికేష న్ విభాగాలు 25వ తేదీలోపు వారికి అప్పగించిన పనులు పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. గార్డెన్ విభాగం 30వ తేదీ మధ్యాహ్నానికి పూల అలంకరణలు పూర్తి చేయాలన్నారు. మహిళలు గ్రౌండ్ లోకి రావడానికి ఐదు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేసి పాసులు జారీ చేస్తామని జెఈ ఓ చెప్పారు.
ఎస్వీబీసీ సీఈఓ శ్రీ సురేష్ కుమార్, ఎస్ ఈ 1 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, విద్యుత్ విభాగం ఎస్ ఈ శ్రీ వెంకటేశ్వర్లు, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ దక్షిణామూర్తి, విజి ఓ శ్రీ మనోహర్ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది