JEO (H&E) INSPECTS VAIBHAVOTSAVAMS ARRANGEMENTS IN BENGALURU _ బెంగళూరులో త్వరలో శ్రీవారి వైభవోత్సవాలు
TIRUPATI, 10 JULY 2023: TTD is contemplating to organise Sri Venkateswara Vaibhavotsavams in Bengaluru City and TTD JEO for Health and Education Smt Sada Bhargavi inspected National College Grounds with TTD officials and local organisers, public representatives and officials on Monday.
She directed TTD officials about the arrangements of stage, barricades, seating, pandals, floral decors, illumination, security, Annaprasadam and water arrangements to be made for the mega religious program for the local devotees. “Very soon the dates will be confirmed”, she added.
Local legislators Sri Udaya Garudachar, Sri Ramamurty, event organisers Sri Pannaga Sayana, Sri Hariprasad Varada, SE2 Sri Jagadeeshwar Reddy, DE Electrical Sri Ravishankar Reddy, SVETA Director Smt Prasanthi, Additional Health Officer Dr Sunil, Tirumala temple one of the chief priests Sri Venugopala Deekshitulu were also present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
బెంగళూరులో త్వరలో శ్రీవారి వైభవోత్సవాలు
– నేషనల్ కాలేజి గ్రౌండ్ లో ఏర్పాట్లపై పరిశీలన జరిపిన టిటిడి జేఈవో శ్రీమతి సదా భార్గవి
తిరుపతి 10 జూలై 2023: బెంగళూరు మహానగరంలో త్వరలో శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు నిర్వహించనున్నామని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి తెలిపారు. వైభోత్సవాల నిర్వహణకు సంబంధించి సోమవారం ఆమె అధికారులు, నిర్వాహకులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలసి బసవన గుడి సమీపంలోని నేషనల్ కాలేజ్ గ్రౌండ్స్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రౌండ్ లో భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లపై నిర్వాహకులు, అధికారులతో చర్చించారు. భక్తులు లోనికి రావడానికి, బయటకు వెళ్లడానికి ఏర్పాటు చేయాల్సిన మార్గాలు, పార్కింగ్, తాగు నీరు, సుమారు వేలాది మందికి సరిపడ సీటింగ్ ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అలాగే ఇంజనీరింగ్ పనులు, సంగీత ,సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ సేవల నిర్వహణపై అధికారులకు పలు సూచన చేశారు. ఐదు రోజులపాటు శ్రీవారి ఆలయంలో జరిగే నిత్య ,వార సేవలను యథాతథంగా నిర్వహించి బెంగళూరు నగరవాసులు వీటిని చూసి తరించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు ఆమె చెప్పారు. నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని జేఈవో తెలిపారు.
శాసన సభ్యులు శ్రీ డి. ఉదయ గరుడా చార్ , శ్రీ సి కె రామమూర్తి, కార్యక్రమ నిర్వాహకులు శ్రీ పన్నగ శయన, శ్రీ హరిప్రసాద్ వరదా, టీటీడీ ఎస్ ఈ శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డిఈ (ఎలక్ట్రికల్) శ్రీ రవి శంకర్ రెడ్డి, శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఎవి ఎస్వో శ్రీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం జేఈవో నేషనల్ కాలేజి గ్రౌండ్ సమీపంలో ఉన్న సత్య ప్రమోద, సత్య ప్రమోద అనెక్స్, వాసవి కన్వెన్షన్ హాల్ ను అర్చకుల వసతి కోసం పరిశీలించారు. వాసవి కన్వెన్షన్ హాల్ లో నిర్వాహకులు, అధికారులతో ఏర్పాట్ల పై సమీక్షించారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయడమైనది