JEO INSPECTS ARRANGEMENTS FOR MAHA SAMPROKSHANAM _ రంపచోడవరంలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ ఏర్పాట్లను పరిశీలించిన జేఈవో శ్రీ వీరబ్రహ్మం
TIRUPATI, 21 MAY 2023: TTD JEO Sri Veerabrahmam on Sunday inspected the ongoing arrangements for Maha Samprokshanam of Srivari temple scheduled on May 22 at Rampachodavaram in Alluri Sitarama Raju district along with the officials concerned.
He directed to keep ready with sufficient buttermilk and water in view of the scorching temperature besides Annaprasadam and shelter facilities for the sake of devotees participating in the event on Monday.
He has also instructed the concerned to make electrical illumination and floral decorations in a befitting manner.
Religious Activities Schedule on May 22
9am and 9:30am : Maha Samprokshanam in the auspicious Mithuna Lagnam
10am onwards: Darshan to devotees
11am: Dhwajarohanam
5pm onwards: Srivari Kalyanotsavam and Dhwajavarohanam
In the inspection, CE Sri Nageswara Rao,Agama Advisor Sri Ramakrishna Deekshitulu, PRO Dr T Ravi, DyEO Sri Venkataiah, VGO Sri Manohar and others were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయండి
– రంపచోడవరంలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ ఏర్పాట్లను పరిశీలించిన జేఈవో శ్రీ వీరబ్రహ్మం
తిరుపతి 21 మే 2023: రంపచోడవరంలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జేఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులకు సూచించారు.
ఆదివారం ఆయన అధికారులతో కలిసి సోమవారం జరగనున్న మహా సంప్రోక్షణ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ , భక్తులందరికీ దర్శనం చేసుకోవడానికి వీలుగా క్యూలైన్లను. ఏర్పాటు చేయాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా. భక్తులకు మజ్జిగ, తాగు నీరు, ప్రసాదాలు విరివిగా అందించడంతోపాటు ఎక్కువ సంఖ్యలో షెల్టర్లు ఏర్పాటు చేయాలని జేఈవో చెప్పారు. ఆలయాన్ని విద్యుత్తు, పుష్పాలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దాలన్నారు. వాహనాల, రద్దీ క్రమబద్దీకరణ కోసం స్థానిక పోలీసుల సహకారంతో తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అతిథులు భక్తులను ఉద్దేశించి మాట్లాడేందుకు అవసరమైన పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు.
టీటీడీ చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వరరావు, పిఆర్ఓ డాక్టర్ రవి, డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య, విజిఓ శ్రీ మనోహర్, ఈ ఈ శ్రీ సుధాకర్, డెప్యూటీ ఈ ఈ ఆనంద రామ్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయడమైనది