JEO INSPECTS BALAMANDIR SCHOOL_ ఎస్వీ బాలమందిరాన్ని ప‌రిశీలించిన జెఈవో

Tirupati, 15 Mar. 19:Tirupati JEO Sri B Lakshmikantham on Friday evening inspected SV Balamandir School in Tirupati.

The TTD run school holds over 500 children and today I inspected to verify the amenities being provided to these children, said JEO.

He also said, a counsellor post to orient the students is long pending in the school. I instructed the school authorities to come out with a proposal to fill the post as well to renovate the bath rooms”, he added.

The JEO said, quality education is motto of TTD since the children has to carry the brand image of TTD when they complete their studies, he said.

DyEO Balamandir Smt Bharathi and other staff were also present

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఎస్వీ బాలమందిరాన్ని ప‌రిశీలించిన జెఈవో

తిరుపతి, 2019 మార్చి 15: తిరుప‌తిలోని ఎస్వీ బాల‌మందిరాన్ని శుక్ర‌వారం సాయంత్రం టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం ప‌రిశీలించారు. అక్క‌డ విద్యార్థుల‌కు అందుతున్న‌ వ‌స‌తుల‌ను ప‌రిశీలించి సంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ ఇక్క‌డ మొత్తం 500 మంది విద్యార్థులు ఉన్నార‌ని, వీరిలో 180 మంది బ‌య‌టి క‌ళాశాల‌ల్లో ఇంట‌ర్, బిటెక్ లాంటి కోర్సులు చ‌దువుతుండ‌గా, 320 మంది స్థానికంగా చ‌దువుతున్నారని తెలిపారు. ఇక్క‌డి విద్యార్థుల‌కు ధార్మిక‌త‌, శ్రీ‌వారి నామాలు, స్తోత్రాలు నేర్పించ‌డంతోపాటు నైపుణ్యంతో కూడిన విద్య‌ను బోధిస్తున్న‌ట్టు తెలిపారు. ఇక్క‌డ భోజ‌నం, తాగునీటి వ‌స‌తి, మ‌రుగుదొడ్ల‌ను ప‌రిశీలించామ‌న్నారు. విద్యాదాన ట్ర‌స్టు ద్వారా అర్హులైన విద్యార్థులకు యూనిఫారం, పుస్త‌కాలు పంపిణీ చేస్తున్న‌ట్టు తెలిపారు. చ‌దువుకోలేని విద్యార్థుల‌కు ఈ ట్ర‌స్టు ద్వారా విద్య‌ను అందిస్తామ‌న్నారు. రానున్న కాలంలో ప‌లు ప్రాంతాల్లో టిటిడి పాఠ‌శాల‌లు, ఆసుప‌త్రులు ఏర్పాటుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌ని వివ‌రించారు.

జెఈవో వెంట టిటిడి ఎస్ఇ-1 శ్రీ ర‌మేష్‌రెడ్డి, డెప్యూటీ ఈఓ శ్రీ‌మ‌తి భార‌తి, ఏఈవో శ్రీ‌మ‌తి దామ‌ర‌సెల్వి, సూప‌రింటెండెంట్ శ్రీ సుధాక‌ర్ ఇత‌ర అధికారులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.