JEO INSPECTS BRAHMOTSAVAM ARRANGEMENTS_ తిరుమలలోని వివిధ ప్రాంతాలలో తిరుమల జె.ఇ.ఓ తనిఖీలు

Tirumala, 14 September 2017: As the annual brahmotsavams of Lord Venkateswara are fast approaching, the Tirumala JEO Sri KS Sreenivasa Raju had inspected various places at Tirumala to see their stage of work on Thursday evening.

The JEO inspected theaged and physically challenged waiting hall in South Mada street and also the ticket counter meant for them located opposite SV Museum and Annaprasadam Complex.

He instructed the concerned to complete the extension works of the waiting hall with proper lighting facilities and the battery cars should be kept ready for the use of this category pilgrims.

Later at Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex he inspected the cold storage room, machinery for making large quantities of food, their cleaning process etc.

SE II Sri Ramachandra Reddy, VGO Sri Ravindra Reddy, DyEOs Sri Kodanda Rama Rao, Sri Venugopal, Catering Officer Sri GLN Shastry and others were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

తిరుమలలోని వివిధ ప్రాంతాలలో తిరుమల జె.ఇ.ఓ తనిఖీలు

సెప్టెంబర్‌ 14, తిరుమల 2017: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మూెత్సవాలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అందుకు జరుగుతున్న ఏర్పాట్లను గురువారం సాయంత్రం తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌ శ్రీనివాసరాజు వివిధ ప్రాంతాలలో పర్యటించి తనిఖీలు చేశారు.

ఇందులో భాగంగా ఆయన దక్షిణమాడ వీధిలో వున్న వయోవృద్ధులు, దివ్యాంగులు దర్శనం కొరకు వేచివుండే హాలును, వీరి కొరకు మ్యూజియం చెంత ఏర్పాటు చేసిన టోకెన్‌ కౌంటర్లను పరిశీలించారు. తి.తి.దే ఇ.ఓ శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు వీరి కొరకు మరింత సౌకర్యాలతో నూతన అదనపు హాలును, కౌంటర్లను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో చేయవలసిన ఎల్‌.ఇ.డి దీపాలు, బ్యాటరీ కార్ల ఏర్పాట్లకు సంబంధిత అధికారులకు సూచించారు.

అనంతరం ఆయన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని సందర్శించారు. అక్కడ వున్న కోల్డు స్టోరేజ్‌ గదిని, పరికరాల పనితీరును, పరిశుభ్రతను పరిశీలించి అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ తణిఖీలో జె.ఇ.ఓతో పాటు ఎస్‌.ఇ2 శ్రీ రామచంద్రారెడ్డి, ఆలయ డిప్యూటి.ఇ.ఓ శ్రీ కోదండరామారావు, అన్నప్రసాద డిప్యూటి.ఇ.ఓ శ్రీ వేణుగోపాల్‌, క్యాటరింగ్‌ అధికారి శ్రీ జి.ఎల్‌.ఎన్‌ శాస్త్రి, వి.జి.ఓ శ్రీ రవీంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.