JEO INSPECTS DEVELOPMENT WORKS AT VONTIMITTA SRI KODANDARAMA SWAMY TEMPLE _ ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో అభివృద్ధి పనులను పరిశీలించిన జెఈవో
Tirupati, 31 Jan. 22: TTD JEO Sri Veerabrahmam on Monday instructed the ongoing development works at Kalyana Vedic of Sri Kodandarama Swamy Temple at Vontimitta in YSR Kadapa district.
Along with Engineering and temple officials, he reviewed the ongoing activities and future works needed.
The JEO told media later that the Archaeological Department officials were tasked with repairs and cleaning of the temple gopuram for which tenders were called and works would commence shortly.
Similarly, he instructed officials regarding green scaping, drinking water, and Prasadam distribution counters.
He said directions have been issued to the concerned towards laying a pathway near Kalyana Vedika and other pending works like PAC rooms development, arch, Ramakoti stupa etc. will be brought to the notice of TTD EO.
The JEO also said TTD is gearing up for the Sri Seetharama Kalyana also during Sri Rama Navami in April but a final decision will be made as per the then existing covid situation.
With regard to the Sri Ram project the Archaeology department directions were sought, he stated.
DyEO Dr Ramana Prasad, SE (Electricals) Sri Venkateswarulu and others were present.
AT DEVUNI KADAPA
Later the JEO inspected Sri Lakshmi Venkateswara Swamy temple in Devuni Kadapa where the annual Brahmotsavams are set to commence from February 2 till 12 with Ankurarpana on February 1.
However he said, due to Covid restrictions the annual fete will be observed in Ekantam.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో అభివృద్ధి పనులను పరిశీలించిన జెఈవో
తిరుపతి, 2022 జనవరి 31: టిటిడికి అనుబంధంగా ఉన్న ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయం, కల్యాణవేదిక వద్ద జరుగుతున్న పలు అభివృద్ధి పనులను జెఈవో శ్రీ వీరబ్రహ్మం సోమవారం పరిశీలించారు. ఇప్పటివరకు చేపట్టిన పనులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులపై ఇంజినీరింగ్, ఆలయ అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ ఆలయ గోపురానికి సంబంధించిన అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆర్కియాలజి విభాగం అధికారులకు బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు. ఇందుకోసం టెండర్లు పిలిచామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. అదేవిధంగా, పచ్చదనం పెంపు, తాగునీరు, ప్రసాద వితరణకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశామన్నారు. వివాహాలు చేసుకునేందుకు మండపం నిర్మించాలని అర్చకులు కోరారని, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కల్యాణవేదిక వద్ద పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని, చక్కటి దారి కల్పించాలని ఆదేశించామన్నారు. పిఏసిలో గదుల అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించామన్నారు. అదేవిధంగా, ఆర్చిల నిర్మాణం, కల్యాణవేదిక వద్ద వివాహాలు చేసుకునే సదుపాయం, రామకోటి స్థూపం తదితర అంశాలను ఈవో దృష్టికి తీసుకెళతామన్నారు.
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నిర్వహించే శ్రీ సీతారాముల కల్యాణానికి సంబంధించి ప్రాథమిక ఏర్పాట్లు చేపట్టి సిద్ధమవుతున్నామని, కోవిడ్ పరిస్థితులను అంచనా వేసుకుని తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. శ్రీరామ్ ప్రాజెక్టుకు సంబంధించి ఆర్కియాలజి విభాగం అధికారుల సూచనల మేరకు ముందుకు వెళతామన్నారు.
జెఈవో వెంట టిటిడి డెప్యూటి ఈవో డా. ఆర్.రమణ్రపసాద్, ఎస్ఇ(ఎలక్ట్రికల్స్) శ్రీ వేంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
ఏకాంతంగా దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు : జెఈవో శ్రీ వీరబ్రహ్మం
కోవిడ్ నేపథ్యంలో దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను ఫిబ్రవరి 2 నుండి 12వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహిస్తామని టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం తెలిపారు. ఫిబ్రవరి 1న అంకురార్పణ జరుగుతుందన్నారు. ఈ ఆలయాన్ని సోమవారం జెఈవో సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెంచడం, అందుకు తగిన సౌకర్యాల పెంపు, పుష్కరిణి ఆధునీకరణ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశామన్నారు. అవసరమైన విద్యుత్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఇక్కడున్న యాత్రికుల వసతి సముదాయాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జెఈవో వెంట టిటిడి డెప్యూటి ఈవో డా. ఆర్.రమణ్రపసాద్, ఎస్ఇ(ఎలక్ట్రికల్స్) శ్రీ వేంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.