JEO INSPECTS G-DAY ARRANGEMENTS_ గ‌రుడ‌సేవ ఏర్పాట్ల‌ను త‌నిఖీ చేసిన జెఈవో

Tirumala, 16 September 2018: Tirumala JEO Sri KS Sreenivasa Raju on Sunday evening inspected the arrangements for Garuda Seva.

As a part of it he inspected the different ways designated for different categories including VVIPs, VIPs, Press, Police, Employees and general pilgrims to enter into the galleries of four mada streets.

CVSO Incharge Sri Siva Kumar Reddy, SE 2 Sri Ramachandra Reddy, were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

గ‌రుడ‌సేవ ఏర్పాట్ల‌ను త‌నిఖీ చేసిన జెఈవో

సెప్టెంబరు 16, తిరుమల 2018: శ్రీ‌వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా సెప్టెంబరు 17న సోమ‌వారం జ‌రుగ‌నున్న గ‌రుడ‌సేవ సంద‌ర్భంగా విశేష సంఖ్య‌లో విచ్చేసే భ‌క్తుల కోసం చేప‌ట్టిన ఏర్పాట్ల‌ను టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు ఆదివారం సాయంత్రం త‌నిఖీ చేశారు.

సప్తగిరి సత్రాల నుండి ఆస్థాన‌మండ‌పం వ‌ర‌కు భ‌క్తులు గ్యాల‌రీల్లోకి చేరుకునే మార్గాన్ని ప‌రిశీలించారు. మాడ వీధుల్లోని ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను పరిశీలించారు. విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులు మాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. భద్రతపరంగా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

జెఈవో వెంట టిటిడి ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఎఫ్ఏ సిఏవో శ్రీ బాలాజి, ఎస్ఇలు శ్రీ రామ‌చంద్రారెడ్డి, శ్రీ సుధాక‌ర్‌రావు, డిఎఫ్‌వో శ్రీ ఫ‌ణికుమార్‌నాయుడు, విఎస్‌వో శ్రీ ర‌వీంద్రారెడ్డి తదిత‌రులు ఉన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.