JEO INSPECTS KT _ శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో టీటీడీ జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం త‌నిఖీలు

TIRUPATI, 09 NOVEMBER 2022: TTD JEO Sri Veerabrahmam on Wednesday inspected Sri Kapileswara Swamy temple in Tirupati and verified the ongoing development works.

He visited the Potu, Yagashala, Kalyana Katta, Office, Pushkarini development works etc. in the temple.

The JEO also viewed the new wooden chariot which is under making and instructed the concerned to ensure that the walls are maintained strong all along the waterfalls flow path.

Later he also inspected the ancient Sri Lakshmi Narasimha Swamy temple and directed the Engineering officials to complete the pending works and get it ready for Samprokshanam.

The JEO directed the Health department officials to remove the waste and debris at regular intervals and keep the temple premises clean and hygienic for devotees.

Later he participated in Chandi Yagam which is going on in the temple as a part of Karthika Homa Mahotsavams.

CAuO Sri Sesha Sailendra, Deputy EO Sri Devendrababu, DFO Sri Srinivasulu, Special Officer Estates Sri Mallikarjuna, and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో టీటీడీ జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం త‌నిఖీలు

తిరుప‌తి, 2022 న‌వంబ‌రు 09: తిరుప‌తి శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను టీటీడీ జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం బుధ‌వారం అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు.

ఆలయంలోని పోటు, యాగశాల, క‌ల్యాణ క‌ట్ట‌, మ‌రుగుదొడ్లు, కార్యాల‌యం, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు. స్వామివారి పుష్కరిణి అభివృద్ధి, ఆల‌య ప్ర‌హ‌రీ గోడ మ‌ర‌మ్మ‌త్తులు చేయాలన్నారు. జలపాతం నుండి నీటి ప్రవాహం బ‌య‌ట‌కు వెళ్ళే మార్గంలో గోడలు ప‌టిష్టంగా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. స్వామివారికి నూత‌నంగా త‌యారు చేస్తున్న‌ చెక్క ర‌థం ప‌నుల‌ను ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సంప్రోక్షణ నిర్వహించేందుకు త్వరిత గ‌తిన‌ పనులు పూర్తి చేయాలన్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇంజినీరింగ్‌, ఆరోగ్య విభాగం వ్య‌ర్థాల‌ను తొల‌గించి, పచ్చదనాన్ని పెంపొందించి సుందరంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారుల‌కు సూచించారు. త‌ద్వారా భ‌క్తుల‌కు మరింత. ఆహ్లాదకర, ఆధ్యాత్మిక వాతావ‌ర‌ణం ఏర్పడుతుంద‌ని జెఈవో తెలిపారు.

చండీయాగంలో పాల్గొన్న జెఈవో దంప‌తులు

ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీయాగం) లో జెఈవో శ్రీ వీరబ్రహ్మం దంప‌తులు పాల్గొన్నారు. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేషపూజ, హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా 7వ రోజు అమ్మ‌వారు స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో భ‌క్తుల‌ను క‌టాక్షించారు.

జెఈవో వెంట డిఎఫ్‌వో శ్రీ శ్రీ‌నివాస్ , రవాణా విభాగం జిఎం శ్రీ శేషారెడ్డి, ఇఇ శ్రీ వేణుగోపాల్‌, ఎస్టేట్ అధికారి శ్రీ మ‌ల్లిఖార్జున‌, సిఎవో శ్రీ శేష శైలేంద్ర‌, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, సూప‌రింటెండెంట్‌ శ్రీ శ్రీ‌నివాసులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.