JEO INSPECTS TTD GODOWNS _ టీటీడీ గోడౌన్లను తనిఖీ చేసిన జేఈవో శ్రీమతి సదా భార్గవి

టీటీడీ గోడౌన్లను తనిఖీ చేసిన జేఈవో  శ్రీమతి సదా భార్గవి
 
తిరుప‌తి, 2022 నవంబర్ 23: తిరుపతిలోని టీటీడీ గోడౌన్లను జేఈవో శ్రీమతి సదా భార్గవి బుధవారం తనిఖీ చేశారు.
 
గోడౌన్లలోని  బియ్యం, జీడిపప్పు, కందిపప్పు, వంట నూనెలు తదితర సరుకులను పరిశీలించారు. 
 
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ,  గోడౌన్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అవసరమైన చోట గోడౌన్లకు మరమ్మత్తులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
 
 అనంతరం తల వెంట్రుకలు నిలువ చేసే గోడౌన్  తనిఖీ చేశారు. తల వెంట్రుకలను వేరు చేయడం, శుభ్రపరచడం, ఎండబెట్టే ప్రక్రియ  పరిశీలించి పలు సూచనలు చేశారు. శ్రీవారికి భక్తులు  సమర్పించిన వస్త్రాలను పరిశీలించి, త్వరితగతిన టెండర్లు పిలిచి వాటిని విక్రయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
 
ఈ తనిఖీల్లో  మార్కెటింగ్ డిప్యూటీ ఈవో శ్రీమతి పద్మావతి,  జిఎం ( కొనుగోలు)
శ్రీ కృష్ణారెడ్డి, ఇఇ శ్రీ సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

JEO CHECKED THE STOCK OF RICE, CASHEW, PULSES AND EDIBLE OILS

Tirupati,23, November 2022: TTD JEO ( Education & Health ) Smt Sada Bhargavi on Wednesday evening inspected the TTD godowns in pilgrim city including that of hair stocks and made valuable suggestions.

She checked the stocks of rice, cashews, pulses, edible oils and directed engineering officials to take up repairs on a fast route and keep godowns clean and green.

At the hair godown, she inspected the process of separation, cleaning and drying of hairs and made valuable suggestions.

At another godown of used and unused clothes donated by devotees she directed officials to inspect the stocks and later organise sale cut, an auction of unwanted stocks.

Marketing DyEO Smt Smt Padmavati, GM( purchases ) Sri Krishna Reddy, EE Sri Subramaniam and other officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI