JEO INSPECTS VARIOUS TTD INSTITUTIONS _ టిటిడిలోని పలు సంస్థల్లో జెఈవో తనిఖీలు
Tirupati, 8 Apr. 21: TTD JEO Smt Sada Bhargavi inspected various TTD institutions on Thursday.
As part of it she visited Bhudevi Complex, Laddu counters, space in front Jabili baby sitting centre behind Administrative Building and instructed the concerned for necessary modifications.
As Vishnu Nivasam is again allocated to district administration as Covid Centre in view of increasing cases, the JEO directed the officials concerned to shift Srivari Sevaks from Vishnu Nivasam to Bhudevi Complex.
DyEO Smt Bharati, VGO Sri Manohar, AVSO Sri Sai Giridhar were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిడిలోని పలు సంస్థల్లో జెఈవో తనిఖీలు
తిరుపతి, 2021 ఏప్రిల్ 08: టిటిడిలోని పలు సంస్థల్లో జెఈవో శ్రీమతి సదా భార్గవి గురువారం తనిఖీలు నిర్వహించారు.
తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, టిటిడి పరిపాలనా భవనం ప్రాంగణంలోని లడ్డూ కౌంటర్లు, జాబిలి చిన్నపిల్లల కేంద్రం ముందు గల ఖాళీ స్థలాన్ని పరిశీలించి చేపట్టాల్సిన మార్పులపై అధికారులకు పలు సూచనలు చేశారు. కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో విష్ణునివాసాన్ని క్వారంటైన్ కేంద్రంగా తిరిగి జిల్లా యంత్రాంగానికి అప్పగించిన నేపథ్యంలో అక్కడి శ్రీవారి సేవకులను భూదేవి కాంప్లెక్స్‌కు తరలించాలని అధికారులను ఆదేశించారు.
జెఈవో వెంట విజివో శ్రీ మనోహర్, డెప్యూటీ ఈవో శ్రీమతి భారతి, ఎవిఎస్వో శ్రీ సాయి గిరిధర్ తదితరులు ఉన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.