JEO INSPECTS WOMEN’S COLLEGE _ శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలను తనిఖీ చేసిన జెఈవో(ఆరోగ్యం , విద్య) శ్రీమతి సదా భార్గవి
TIRUPATI, 09 Dec. 20: JEO for Health and Education, Smt Sada Bhargavi on Wednesday inspected SPWPG.and Degree College.
She verified the mid day meals, COVID norms which are under operation and given necessary instructions to the concerned..
DEO Sri Ramana Prasad was also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలను తనిఖీ చేసిన జెఈవో(ఆరోగ్యం , విద్య) శ్రీమతి సదా భార్గవి
తిరుపతి, 2020 డిసెంబర్ 9: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలను జెఈవో(ఆరోగ్యం , విద్య) శ్రీమతి సదా భార్గవి బుధవారం తనిఖీ చేశారు .
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి విద్యాసంస్థల్లో కోవిడ్-19 మార్గదర్శకాల అమలుతీరును, పాఠ్యాంశాల బోధన పరిశీలించి పలు సూచనలు చేశారు. కళాశాలలోని విద్యార్థి. ణులఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి తగుజాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
టీటీడీ కళాశాలలోని విద్యార్థులకు భగవద్గీత, అన్నపూర్ణేశ్వరి శ్లోకాలను నేర్పించాలన్నారు. టీటీడీ ఐటి విభాగంతో సమన్వయం చేసుకుని విద్యార్థుల రికార్డులు భద్రపరచాలన్నారు. టీటీడీ డిగ్రీ కళాశాలకు నాక్ గుర్తింపునకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని సూచించారు. కళాశాలలో అవసరమైన ఇంజినీరింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
జెఈఓ వెంట టిటిడి విద్యాశాఖాధికారి డా. ఆర్.రమణప్రసాద్ ఉన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.