JEO LAUDS VEGETABLE DONORS_ అన్నప్రసాద కూరగాయల దాతల సేవలు అపురూపమైనవి – తిరుమల జె.ఇ.ఓ

Tirumala, 12 September 2017: JEO Sri KS Sreenivasa Raju lauded the impeccable contributions of vegetable donors for their largesse in TTD’s massive program of distribution of Annaprasadam.

A thanksgiving meeting was organised by Annaprasadam Wing of TTD at Annamaiah Bhavan in Tirumala on Tuesdayevening which was as attended by vegetable donors hailing from Andhra Pradesh, Tamilnadu and Karnataka. Speaking to donors, the JEO said, started with just 2000 pilgrims in 1985 today, TTD provides free food to nearly one Lakh pilgrims a day not only in the massive Annaprasadam complex, but also in PAC II, queue lines when there is heavy rush, in compartments and also in food courts. “We could able to do the Annaprasadam activity in a massive way without any interruption with your support. We foresee the same support during the ensuing Brahmotsavams as well in future”, he added.

Later the JEO felicitated the vegetable donors with the prasadams of Lord Venkateswara.
Annaprasadam DyEO Sri S Venugopal, Catering officer Sri GLN Shastry, other Annaprasadam officials were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

అన్నప్రసాద కూరగాయల దాతల సేవలు అపురూపమైనవి – తిరుమల జె.ఇ.ఓ

సెప్టెంబర్‌ 12, తిరుమల 2017: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఏనాడు ఏ కొరతా రాకుండా తి.తి.దే నిరంతరం అన్నప్రసాద సేవలు ఘన విజయం సాధించడానికి తోడ్పడుతున్న కూరగాయల దాతల సేవలు అమూల్యమైనవి, అపురూపమైనవి అని తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు కొనియాడారు.

మంగళవారంనాడు తిరుమలలోని అన్నమయ్య భవనంలో త్వరలో రానున్న బ్రహ్మూెత్సవాల సందర్భంగా కూరగాయల దాతలతో మర్యాదపూర్వకంగా సమావేశమైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1985 ఏప్రిల్‌ 6వ తేది కేవలం 2000 మందితో ప్రారంభమైన తి.తి.దే అన్నప్రసాద సేవ ఈ మూడు దశాబ్దాల పైచిలుకు ప్రస్థానంలో రోజుకు లక్షమందికి తగ్గకుండా అన్నప్రసాద సేవలందించడం అద్వితీయమన్నారు. ప్రారంభదశలో దర్శనానికి వచ్చిన భక్తులకు మాత్రమే టోకెన్‌లు అందించి వారికి అన్నప్రసాదులు ఇచ్చేవారని, కాని నేడు అసంఖ్యాకంగా భక్తులకు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో మాత్రమే కాకుండా మాధవ నిలయం, క్యూలైన్లు, కంపార్టుమెంట్లలలో కూడా భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం తి.తి.దే కే సాధ్యమన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో క్యూలైన్లు వెలుపలకి వచ్చినప్పుడు కూడా తి.తి.దే ఎవరికీ లేదు అనకుండా భక్తులపాలిట అక్షయపాత్ర లాగా అన్నప్రసాద వితరణ చేస్తోందన్నారు. భక్తులు కూడా తి.తి.దే చేస్తోన్న అన్నప్రసాద వితరణని వేనోళ్ళ శ్లాఘిస్తున్నారన్నారు. తి.తి.దే నిరంతరం సాగిస్తున్న ఈ అన్నప్రసాదం వితరణ వెనుక ప్రధాన భూమికను పోషిస్తున్న కూరగాయల దాతలను ఆయన పేరుపేరునా ప్రశంసించారు. అనంతరం వారిని శ్రీవారి ప్రసాదలతో సత్కరించారు.

ఈ సమావేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 20 మందికి పైగా కూరగాయల దాతలు పాల్గొన్నారు. వీరితో పాటు అన్నప్రసాద డిప్యూటి.ఇ.ఓ శ్రీ వేణుగోపాల్‌, క్యాటరింగ్‌ అధికారి శ్రీ శాస్త్రి తదితరులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.