JEO RELEASES PAVITROTSVAM BOOKLET OF SRINIVASA MANGAPURAM _ శ్రీనివాసమంగాపురం ఆల‌య‌ పవిత్రోత్సవాల క‌ర‌ప‌త్రాల ఆవిష్క‌ర‌ణ

TIRUPATI, 30 OCTOBER 2023: TTD JEO Sri Veerabrahmam on Monday evening released the annual Pavitrotsvams booklet of Srinivasa Mangapuram.

The booklet release event took place in his chambers in TTD Administrative Building in Tirupati.

Speaking on the occasion he said the religious festival will be observed from November 8-11 with Ankurarpanam. On November 9, Pavitra Pratista, November 10, Pavitra Samarpana and on November 11 Pavitra Purnahuti will be observed.

He said this traditional festival is observed every year to waive off the sins committed either knowingly or unknowingly by religious and non-religious staff, devotees.

Special Gr DyEO Smt Varalakshmi, AEO Sri Gopinath and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీనివాసమంగాపురం ఆల‌య‌ పవిత్రోత్సవాల క‌ర‌ప‌త్రాల ఆవిష్క‌ర‌ణ‌
 
తిరుపతి, 2023 అక్టోబ‌రు 30: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో న‌వంబ‌రు 9 నుండి 11వ తేదీ వరకు జ‌రుగ‌నున్న పవిత్రోత్సవాలు క‌ర‌ప‌త్రాల‌ను టీటీడీ జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం సోమ‌వారం ఆవిష్క‌రించారు.
 
ఆల‌యంలో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జ‌రిగే దోషాల నివార‌ణ‌కు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
 
న‌వంబ‌రు 8న అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది. న‌వంబ‌రు 9న పవిత్ర ప్రతిష్ట‌, 10న పవిత్రసమర్పణ, 11న పూర్ణాహుతి జ‌రుగ‌నున్నాయి. ఈ మూడు రోజుల పాటు ఉద‌యం స్న‌ప‌న‌తిరుమంజ‌నం, సాయంత్రం వీధి ఉత్స‌వం నిర్వ‌హిస్తారు.
 
పవిత్రోత్సవాల కారణంగా న‌వంబ‌రు 8న అష్టోత్త‌ర శ‌త‌క‌ల‌శాభిషేకం, న‌వంబ‌రు 9 నుంచి 11వ తేదీ వరకు కల్యాణోత్సవం, న‌వంబ‌రు 9న తిరుప్పావ‌డ సేవ‌ ర‌ద్దయ్యాయి. గృహస్తులు(ఇద్దరు) రూ.516/- చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రం, ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మి, పిఆర్వో డా.టి.రవి, సూప‌రింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయ‌లు, అర్చకులు శ్రీ బాలాజిరంగాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.