JEO REVIEWS ON THE PROGRESS OF SSD COUNTERS_ సర్వదర్శనం టైంస్లాట్ కౌంటర్ల పురోగతిపై జెఈవో సమీక్ష

Tirumala, 27 February 2018: As the Slotted Sarva Darshan (SSD) counters are set to commence on second fortnight of March, Tirumala JEO Sri KS Sreenivasa Raju reviewed with Engineering officials on progress of works.

The review meeting was held at Annamaiah Bhavan in Tirumala on Tuesday. JEO directed the concerned to complete the civil, electrical, IT works as per the schedule. “All the 55 SSD counters in Tirupati and 32 in Tirumala should complete within the time frame”, he added.

CE Sri Chandrasekhar Reddy, FACAO Sri Balaji and other senior officers were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

సర్వదర్శనం టైంస్లాట్ కౌంటర్ల పురోగతిపై జెఈవో సమీక్ష

ఫిబ్రవరి 27, తిరుమల, 2018: మార్చి రెండో పక్షంలో సమయ నిర్దేశిత సర్వదర్శన విధానాన్ని అమలుచేయనున్న నేపథ్యంలో కౌంటర్ల పురోగతిపై టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈ మేరకు మంగళవారం సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ నిర్దేశించిన గడువులోపు కౌంటర్ల వద్ద సివిల్, ఎలక్ట్రికల్, ఐటి సంబంధిత పనులను పూర్తి చేయాలన్నారు. తిరుపతిలో 55 కౌంటర్లు, తిరుమలలో 32 కౌంటర్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి ఎఫ్ఏసిఏఓ శ్రీ ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.