JEO TIRUMALA REVIEWS ON V DAY ARRANGEMENTS_ వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై జెఈఓ సమీక్ష

Tirumala, 12 Dec. 18: Tirumala JEO Sri KS Sreenivasa Raju reviewed on the ongoing arrangements for Vaikuntha Ekadasi on Wednesday evening.

The meeting was held at Padmavathi Rest House in Tirupati. The JEO instructed the reception wing officials to verify all the rooms in Tirumala by the evening of December 13. He also directed the EE FMS Sri Mallikarjuna Prasad to submit a verification report on the maintenance of rooms by December 14.

Later the JEO instructed the Reception wing officials Sri Balaji and Smt Parvathi to allot block wise duties for their staffs.

SE 1 Sri Ramesh Reddy, GM Sri Sesha Reddy, Annaprasadam SO Sri Venugopal and other officers were also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై జెఈఓ సమీక్ష

డిసెంబరు 12, తిరుమల, 2018: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు సంబంధించి తిరుమలలో జరుగుతున్న ఏర్పాట్లపై టీటీడీ తిరుమల జేఈవో శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు బుధవారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ రిసెప్షన్ అధికారులు డిసెంబరు 13వ తేదీ సాయంత్రంలోపు అన్ని గదుల్లో వసతులను సరిచూసుకోవాలన్నారు. గదుల నిర్వహణకు సంబంధించి 14వ తేదీ నాటికి పరిశీలన నివేదిక సమర్పించాలని ఎఫ్ఎంఎస్ ఈఈ శ్రీ మల్లికార్జున ప్రసాద్ ను ఆదేశించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు బ్లాకుల వారీగా సిబ్బందికి విధులు కేటాయించాలని రిసెప్షన్ అధికారులు శ్రీ బాలాజీ, శ్రీమతి పార్వతికి సూచించారు.

ఈ సమావేశంలో టీటీడీ ఎస్ఇ-1 శ్రీ రమేష్ రెడ్డి, ట్రాన్స్ పోర్ట్ జనరల్ మేనేజర్ శ్రీశేషారెడ్డి, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.