JEWELS OF LORD ARE ABSOLUTELY SAFE-NO HIDDEN CONSPIRACY IN POTU RENOVATION_ శ్రీవారి ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయి
ALLEGATIONS BY FORMER CHIEF PRIEST SRI RAMANA DEEKSHITULU ARE BASELESS
CONFIRMS TTD BOARD
Tirumala, 25 June 2018: All jewels of Lord Sri Venkateswara are absolutely safe and no hidden conspiracy involved behind potu renovation, asserted TTD Trust Board Chairman Sri Putta Sudhakar Yadav.
Following the doubts raised by former Chief Priest Sri AV Ramana Deekshitulu over the safety of jewels, to clear the ambiguity surrounding the safety of jewels among multitude of devotees of Lord Venkateswara present across the globe, TTD board chairman along with other members inspected the jewel safe located inside sanctum sanctorum on Monday.
After a detailed inspection which lasted for nearly five hours, the TTD chairman briefed media persons at Sri Padmavathi Rest House in Tirumala. Excerpts from the press conference:
* All the jewels of Lord Venkateswara are absolutely safe amidst tight security set up.
* TTD has been maintaining Tiruvabharanam register since 1952. The details of each and every jewel is clearly mentioned in the register.
*Justice Jagannadha Rao committee and Justice Wadhwa committee have already given a detailed report certifying that all jewels are absolutely safe and in tact.
*We were astonished to see the way the jewels are safeguarded in Tirumala temple. It was like ‘Padamavyuha’. The hi-fi security cameras vigil round the clock and safeguard the jewels.
*There are three sets of safe locker keys with one set being maintained by Chief Priest of the temple, another lies with Deputy EO of the temple and the other one with Bokkasam Incharge (jewelry Superintendent).
*It is impossible to do any mischief with the jewels. So the allegations made by Sri Ramana Deekshitulu are absolutely baseless.
*With respect to another allegation made by him over the digging of potu for hidden treasures is void of any truth.
*The potu is an age-old structure with one sidewall already in dilapidated condition.
*Keeping in view the safety of the entire temple structure (as it happens to be close to main shrine) and the safety of potu workers, our engineers have taken all safety measures while executing repair works. The refractory brick walls and gudders were erected to prevent the damage to the structure and no digging took place on floor. This is the fact and realty.
*Sri Ramana Deekshitulu should stop the mud slinging against TTD and Lord Venkateswara as there is no truth in his allegations.
Board members Sri Bonda Uma Maheswara Rao, Sri Peddireddi, Sri Meda Ramakrishna Reddy, Sri Ashok Reddy, Sri Rudraraju Padmaraju, Sri Sandra Venkata Veeraiah, and Sri Krishna were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయి
పోటులో ఎలాంటి తవ్వకాలు జరగలేదు
ఆలయంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంది
శ్రీ రమణదీక్షితులు అవాస్తవాలను ప్రచారం చేయడం మానుకోవాలి:
టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్
తిరుమల, 25 జూన్ 2018: ప్రపంచప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమలలోని శ్రీవారి ఆలయంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతావలయంలో స్వామివారి ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయని, పోటులో ఎలాంటి తవ్వకాలు జరగలేదని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. టిటిడి మాజీ ప్రధానార్చకులు శ్రీ రమణదీక్షితులు ఇకనైనా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా అవాస్తవాలను ప్రచారం చేయడాన్ని మానుకోవాలని హితవుపలికారు. తిరుమలలోని శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో సోమవారం రాత్రి టిటిడి ఛైర్మన్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ ధర్మకర్తల మండలి సభ్యులతోపాటు తాను శ్రీవారి ఆలయంలోని వజ్ర వైఢూర్యాలతో కూడిన ఆభరణాలను నిశితంగా పరిశీలించామని, 24 గంటల పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల సిసి కెమెరాల నిఘాలో సురక్షితంగా ఉన్నాయని తెలిపారు. 1952 నుండి మిరాశీ వ్యవస్థ రద్దయిన 1996 వరకు ప్రతి ఆభరణాన్నీ తిరువాభరణం రిజిస్టర్‌లో నమోదు చేశారని చెప్పారు. ఆభరణాల గదికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గల తాళాలు ఉన్నాయన్నారు. 2001లో గరుడసేవ సందర్భంగా భక్తులు నాణేలు విసరడంతో కెంపు రాయి పగిలిపోయిందని, పగిలిన కెంపు పొడిని సేకరించి మూటకట్టి రిజిస్టర్‌లో నమోదు చేశారని, ఆ తరువాత జస్టిస్ జగన్నాథరావు కమిటీ, జస్టిస్ వాద్వా కమిటీ పూర్తిస్థాయి విచారణ జరిపి దాన్ని కెంపుగా తేల్చారని వివరించారు.
పోటులో జరిగిన మరమ్మతులను పరిశీలించామని, ఇక్కడ వేడి కారణంగా పురాతన గోడలు దెబ్బతినకుండా ఒక అడుగు మందంతో ఫైర్ రిఫ్రాక్టరీ బ్రిక్‌వాల్ మాత్రమే ఏర్పాటుచేశారని, నేలపై ఎలాంటి తవ్వకాలు జరగలేదని, పోటు మరమ్మతులు ఆగమసలహా మండలి సలహాతోనే జరిగాయని ఛైర్మన్ వివరించారు.
ఈ మీడియా సమావేశంలో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు, శ్రీ మేడా రామకృష్ణారెడ్డి, శ్రీ పెద్దిరెడ్డి, శ్రీ సండ్ర వెంకట వీరయ్య, శ్రీరుద్రరాజు పద్మరాజు, శ్రీ శ్రీకృష్ణ, శ్రీ అశోక్ పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.