JOYOUS SPORTS MEET _ ఉత్సాహంగా టిటిడి ఉద్యోగుల క్రీడలు

Tirupati, 6 Feb. 20: The ongoing TTD employees annual sports meet-2020 continued on an enthusiastic note on Thursday with dynamic participation by all sections of employees.

VOLLEY BALL

In the volleyball event for senior men TTD officials, the team of EE Sri Jaganmohan Reddy defeated the CE Sri Ramachandra Reddy team 

TENNIKOIT

In the Tennikoit singles event  for TTD senior women officials Smt Jhansi Rani, DyEO was victorious over the Dr S Kusuma Kumari.

In the doubles event the team of Smt Snehalata and Smt Jhansi Rani trounced the Dr S Kusuma Kumari and Dr B Kusuma Kumari team.

SHUTTLE

In the shuttle  singles event for senior men TTD officials SE 2 Sri Nageswar Rao defeated EE Sri Ravi Prabhakar.

In the doubles event the team SE Sri Nageswar Rao and  EE Sri Ravi Prabhakar won over the team of Sri Subramanyam and Sri Mallikarjuna Prasad .

In the shuttle single event for 41-50 years men Sri Venkatramana defeated Sri A Vasu  in the doubles event Sri Ganapati and Sri Bhaskar Reddy team won over Sri Balaji and Sri Vijay Kumar team.

In the shuttle single event for 40 years women Smt K Saraswati defeated Sri P Lahiri. While in the doubles event Sri P Lahari and Smt G Jayashri  team trounced Smt Chinna Munemma and Smt R Soujanya .

BADMINTON

In the 41-50 year doubles event for women K Padmaja team remained winners while Smt Srivani team were runners up.

CAROMS 

In the special category for talented Mens singles event Sri Bhaskar won over Sri Reddappa. In the doubles event Sri Bhaskar and Sri Satyam team won over Sri Muni Reddy and Sri Vidyasagar team.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

ఉత్సాహంగా టిటిడి ఉద్యోగుల క్రీడలు

 తిరుపతి, 2020 ఫిబ్రవరి 06 : టిటిడి ఉద్యోగుల క్రీడలు తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని పరేడ్‌ మైదానంలో గురువారం ఉత్సాహంగా జరిగాయి.

వాలీబాల్‌

–       టిటిడి సీనియర్ పురుష అధికారుల వాలీబాల్‌ పోటీలలో ఇఇ శ్రీ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి జ‌ట్టు విజయం సాధించగా, సిఇ శ్రీ రామ‌చంద్ర‌రెడ్డి జ‌ట్టు రన్నరప్‌గా నిలిచారు.

టెన్నికాయిట్ –

–       టిటిడి సీనియర్‌ మహిళ అధికారుల టెన్నికాయిట్ పోటీలలో శ్రీమతి ఝాన్సీరాణి విజయం సాధించగా, డా.ఎస్‌.కుసుమకుమారి రన్నరప్‌గా నిలిచారు. టెన్నికాయిట్ డబుల్స్‌ పోటీలలో శ్రీ‌మ‌తి స్నేహ‌ల‌త‌, శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి జట్టు విజయం సాధించగా, డా.ఎస్‌.కుసుమ‌కుమారి, డా.బి.కుసుమ‌కుమారి రన్నరప్‌గా నిలిచారు.

ష‌టిల్ –

–      టిటిడి సీనియర్‌ పురుష అధికారుల ష‌టిల్ సింగిల్స్ పోటీలలో ఎస్ఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు  విజయం సాధించగా, ఇఇ శ్రీ ర‌విప్ర‌భాక‌ర్ రన్నరప్‌గా నిలిచారు. ష‌టిల్ డబుల్స్‌ పోటీల్లో  శ్రీ‌నాగేశ్వ‌ర‌రావు,  శ్రీ ర‌విప్ర‌భాక‌ర్ జట్టు విజయం సాధించగా,  శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, శ్రీ మ‌ల్లీఖార్జున ప్ర‌సాద్‌ జట్టు రన్నరప్‌గా నిలిచింది.

 –      41 నుంచి 50 ఏళ్ల లోపు పురుష ఉద్యోగుల ష‌టిల్ సింగిల్స్‌ పోటీల్లో శ్రీ వెంక‌ట‌ర‌మ‌ణ విజేతగా నిలవగా, శ్రీ ఏ.వాసు రన్నరప్‌గా నిలిచారు.  ష‌టిల్ డబుల్స్‌ పోటీల్లో శ్రీ గ‌ణ‌ప‌తి, శ్రీ భాస్క‌ర్‌రెడ్డి జట్టు విజయం సాధించగా, శ్రీ బాలాజి, శ్రీ విజ‌య‌కుమార్ వ‌ర్మ జట్టు రన్నరప్‌గా నిలిచింది.

–       40 ఏళ్ల లోపు మహిళ ఉద్యోగుల ష‌టిల్  సింగిల్స్ పోటీల్లో శ్రీ‌మ‌తి కె.స‌ర‌స్వ‌తి
గెలుపొందగా, శ్రీ‌మ‌తి పి.ల‌హ‌రి రన్నరప్‌గా నిలిచింది. ష‌టిల్ డబుల్స్‌ పోటీల్లో  శ్రీ‌మ‌తి పి.ల‌హ‌రి,  శ్రీ‌మ‌తి జి.బైయ‌శ్రీ జట్టు విజయం సాధించగా,  శ్రీ‌మ‌తి వి.చిన్న‌మున్నెమ్మ‌,  శ్రీ‌మ‌తి ఆర్‌.సౌజ‌న్య  జట్టు రన్నరప్‌గా నిలిచింది.

బ్యాడ్మింటన్ –

 –      41 నుంచి 50 ఏళ్ల లోపు మహిళల బ్యాడ్మింటన్ పోటీల్లో కె.ప‌ద్మ‌జ జ‌ట్టు విజేతగా నిలవగా,  శ్రీ‌మ‌తి శ్రీ‌వాణి జ‌ట్టు రన్నరప్‌గా నిలిచారు.  

క్యారమ్స్

 – ప్రత్యేక ప్రతిభ వంతుల విభాగంలో పురుష ఉద్యోగుల క్యారమ్స్‌ సింగిల్స్‌ పోటీలలో శ్రీ భాస్క‌ర్ విజయం సాధించగా, శ్రీ రెడ్డ‌ప్ప‌ రన్నరప్‌గా నిలిచారు. క్యారమ్స్‌ డబుల్స్‌ పోటీలలో శ్రీ స‌త్యం, శ్రీ భాస్క‌ర్‌ జట్టు విజయం సాధించగా, శ్రీ మునిరెడ్డి, శ్రీ విద్యాసాగ‌ర్‌ జట్టు రన్నరప్‌గా నిలిచారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.