JUNE MONTH QUOTA RELEASE OF SRIVARI ARJITA SEVA TICKETS _ శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల జూన్ నెల కోటా విడుదల

Tirumala, 17 March 2025: TTD will release the June month quota of Suprabhatam, Tomala, Archana and Astadala Pada Padmaradhana  Seva tickets on March 18 at 10 AM online.

The Online registration for lucky dip registration of these Seva tickets can be carried out from March 18 till 10am of March 20.

Devotees who got these tickets through Lucky Dip will be allotted the tickets if they pay the amount before 12 noon of March 22.

The June month quota of Kalyanotsavam, Unjal Seva, Arjitha Brahmotsavam and Sahasra Deepalankara Seva tickets will be released on March 21 at 10 am.

Tickets will be made available to devotees on March 21 at 11 am to participate in the Srivari Jyeshtabhishekam, which will be held from June 9 to 11.

TTD will release the virtual sevas and their darshan slots on March 21 at 3 PM.

TTD will release the Angapradakshinam Tokens quota on March 22 at 10 am.

TTD will release the  Srivani Trust tickets on 22nd March at 11 am.

TTD will release the aged people, physically handicapped darshan tokens at 3 pm on March 22.

TTD will release Rs.300 special entry darshan tickets on March 24 at 10 am.

For accommodation in Tirumala and Tirupati the quota will be released on March 24 at 3 PM.

Devotees are requested to book Srivari Arjita Sevas, darshan tickets and accommodation only through the official website of TTD https://ttdevasthanams.ap.gov.in 

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల జూన్ నెల కోటా విడుదల

తిరుమ‌ల‌, 2025 మార్చి 17: తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, అష్టదళ పాదపద్మారాధన సేవల జూన్ నెల కోటాను మార్చి 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేష‌న్‌ కోసం మార్చి 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు మార్చి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరవుతాయి.

మార్చి 21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల జూన్ నెల కోటాను మార్చి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

మార్చి 21న జ్యేష్టాభిషేకం టికెట్లు…

జూన్ 09 నుండి 11వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు టికెట్లను మార్చి 21న ఉదయం 11 గంటలకు భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతారు.

మార్చి 21న వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూన్ నెల కోటాను మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

మార్చి 22న‌ అంగప్రదక్షిణం టోకెన్లు….

జూన్ నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూన్ నెల ఆన్ లైన్ కోటాను మార్చి 22వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా జూన్ నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను మార్చి 22న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

మార్చి 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

జూన్ నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…

తిరుమల, తిరుపతిల‌లో జూన్ నెల గదుల కోటాను మార్చి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.