JYESTABHISHEKAM AT SRIVARI TEMPLE FROM JUNE 3-6 _ జూన్‌ 4 నుంచి 6వ తేదీ వరకు శ్రీ‌వారి ఆల‌యంలో జ్యేష్టాభిషేకం

Tirumala, 2 June 2020: TTD is organising a three-day holy annual festival of Jyeshtabhishekam from June 4-6 at Srivari temple as a part of Agama traditions in Jyesta masa and Jyesta Nakshatram.

In view of Coronavirus guidelines, the festival will be held in Ekantham at the Kalyan Mandapam inside the Sampangi Prakaram of Srivari temple.

As per the Agama pundits the Abhidheyaka Abhisekam is performed to utsava idols after removing the gold/silver/diamond armours in order to retain the divinity of the idols.

On the first day, the golden cover is removed for performing Snapana Tirumanjanam and later Sri Malayappa Swamy is adorned with Ratna Kavacham.

Archakas say that pearl cover is adorned to utsava idols on the second day and on the third day on final day after Snapana Tirumanjanam, the idols are dressed in the gold cover which is not removed till the annual Jyestabhishekam next year. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI   

జూన్‌ 4 నుంచి 6వ తేదీ వరకు శ్రీ‌వారి ఆల‌యంలో జ్యేష్టాభిషేకం

తిరుమ‌ల, 02 జూన్ 2020: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జూన్ 4 నుంచి 6వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం జ‌రుగ‌నుంది. ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల‌పాటు జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. కోవిడ్‌-19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా జ్యేష్టాభిషేకాన్ని ఏకాంతంగా చేప‌డ‌తారు.

సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘’అభిద్యేయక అభిషేకం’’ అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాల‌తో అత్యంత ప్రాచీనములైన శ్రీస్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. మొదటిరోజు శ్రీ మల‌యప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు.

రెండవరోజు ముత్యాల‌ కవచం సమర్పిస్తారు. మూడవరోజు తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని సమర్పిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్టాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే ఉంటారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.