JYESTABHISHEKAM IN SRI GT FROM JULY 4_ జూలై 4 నుండి 6వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకం

TIRUMALA TIRUPATI DEVASTHANAMS

JYESTABHISHEKAM IN SRI GT FROM JULY 4

26 June 2017: The three day annual Jyestabhishekam will be observed from July 4 to 6 in the famous shrine of Sri Govindaraja Swamy in Tirupati.

As a part of this on first day Kavacha Adhivasam, next day Kavacha Pratishtha and final day Kavacha Samarpana will be performed as per temple tradition.

During these three days Punyahavachanam, Shanti Homam, Snapanam, Satakalasa Snapanam and Veedhi Utsavam will be performed.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 4 నుండి 6వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకం

తిరుపతి, 2017, జూన్‌ 26 : తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 4 నుండి 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం (అభిధేయక అభిషేకం) ఘనంగా జరుగనుంది. ఇందులో స్వామివారి స్వర్ణ కవచాలకు జూలై 4న కవచ అధివశం, జూలై 5న కవచ ప్రతిష్ఠ, జూలై 6న కవచ సమర్పణ నిర్వహిస్తారు.

ఈ ఉత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం మహాశాంతి హోమం, పుణ్యాహవచనం, స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం శతకలశస్నపనం, సాయంత్రం వీధి ఉత్సవం నిర్వహించనున్నారు. ప్రతి ఏడాదీ ఆషాడ మాసం, జ్యేష్టా నక్షత్రం రోజున ఆలయంలో జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.