KALIYA MARDANA KRISHNA BLESSES ON SARVABHUPALA _ స‌ర్వ‌భూపాల‌ వాహనంపై కాళీయమర్ధనుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

TIRUMALA, 10 OCTOBER 2021:  Sri Malayappa Swamy as “Kaliya Mardana Krishna” blessed His devotees on the tastefully decorated Sarvabhupala Vahanam, flanked by Sridevi and Bhudevi on his either sides on Sunday evening, as part of ongoing annual brahmotsavams at Tirumala on fourth day.

 

Sarvabhupala signifies that Srivaru is Supreme Chief of all deities and ruler of the rulers. “Dharma Samsthapanarthaya..Sambhavami Yuge Yuge” the Paramatma Himself stated that He will take incarnation again and again as and when need arises to save the entire humanity by destroying the evil and re-establishing Dharma”.  By gracing Sarvabhupala vahanam, Sri Malayappa sends a message to His devotees, that He is always there at their rescue.

 

Both the senior and junior pontiffs of Tirumala, Deputy Speaker Sri K Raghupati, AP High Court Judge Justice Sri Seshasai, TTD Chairman Sri YV Subba Reddy, EO Dr KS Jawahar Reddy, board members Smt Prasanthi Reddy, Sri P Ashok Kumar, Sri AP Nanda Kumar, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, temple Deputy EO Sri Ramesh Babu and others were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

2021 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

స‌ర్వ‌భూపాల‌ వాహనంపై కాళీయమర్ధనుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

తిరుమ‌ల‌, 2021 అక్టోబ‌రు 10: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం రాత్రి 7 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ‌ మండ‌పంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు కాళీయమర్ధనుడి అలంకారంలో స‌ర్వ‌భూపాల‌ వాహనంపై దర్శనమిచ్చారు.

సర్వభూపాల వాహ‌నం – య‌శోప్రాప్తి

సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.

వాహనసేవల‌లో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, శాసనసభ ఉప సభాపతి శ్రీ కోన రఘుపతి, ఎపి హైకోర్టు న్యాయమూర్తి శ్రీ శేషసాయి, టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి ప్ర‌శాంతి రెడ్డి, శ్రీ పోకల అశోక్ కుమార్, శ్రీ ఎపి.నందకుమార్, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి దంపతులు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

కాగా, బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన సోమ‌వారం ఉదయం 9 గంటలకు మోహినీ అవ‌తారం, రాత్రి 7 గంటలకు గ‌రుడ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.