KALIYA MARDHANA KRISHNA SHINES BRIGHT UNDER MUTYAPU PANDIRI _ ముత్య‌పు పందిరి వాహనంపై కాళీయ‌మ‌ర్ధ‌న చిన్నికృష్ణుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

Tirumala, 21 Sep. 20: On the third day evening of the ongoing nine-day annual Brahmotsavams at Tirumala on Monday, the processional deity of Lord  Malayappa Swamy, seated under the `Muthyapu Pandiri Vahanam’ blessed His devotees in Kaliya Mardhana Krishna Avatara.

In view of COVID-19 restrictions, the vahana Seva was observed at the Kalyanotsava Mandapam inside the Srivari temple.

Legend says that pearls, a produce of sea, is formed when the dew and rain drops into pearl chip in the ocean. Even Srikrishna wears pearl nose rings and necklaces and also Lord Venkateswara hailed as “Alankara priya”(lover of decoration). 

The 26th  chapter of  Padma Puranam refers to an umbrella made of pearls giving shade to Lord Vishnu. Symbolising this, Lord Malayappa flanked by His two consorts Sridevi and Bhudevi graced under the pearl canopy. 

TTD EO Sri Anil Kumar Singhal, Board members Sri Ananta, Sri Siva Kumar, Sri Govindhari, Sri DP Anantha, Sri Sekhar Reddy, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Srivari temple DyEO Sri Harindranath were also present. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

2020 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

ముత్య‌పు పందిరి వాహనంపై కాళీయ‌మ‌ర్ధ‌న చిన్నికృష్ణుడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

తిరుమల, 2020 సెప్టెంబ‌రు 21: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమ‌వారం రాత్రి 7 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ‌ మండ‌పంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు కాళీయ‌మ‌ర్ధ‌న చిన్నికృష్ణుడి అలంకారంలో ముత్య‌పుపందిరి వాహనంపై దర్శనమిచ్చారు.

ముత్య‌పు పందిరి – స‌క‌ల సౌభాగ్య సిద్ధి

ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం. అందుకే శ్రీమలయప్పకు మూడో రోజు రాత్రి మొదటియామంలో ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్ని పెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణచక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.

వాహనసేవల‌లో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, బోర్డు స‌భ్యులు శ్రీ డిపి.అనంత‌, శ్రీ శివ‌కుమార్‌, శ్రీ శేఖ‌ర్‌రెడ్డి, శ్రీ గోవింద‌హ‌రి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుమ‌ల పూర్వ‌పు జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీ‌నివాస‌రాజు, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్ పాల్గొన్నారు.

కాగా, బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజైన మంగ‌ళ‌‌‌వారం ఉదయం 9 గంటలకు క‌ల్ప‌వృక్ష వాహనం, రాత్రి 7 గంటలకు స‌ర్వ‌భూపాల‌ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.