KALIYAMARDHANA ALANKARAM _ ముత్య‌పుపందిరి వాహనంపై కాళీయమర్ధనుడి అలంకారంలో శ్రీ వేణుగోపాల స్వామి

Tirupati, 31 May 2024: On the third evening of the annual Brahmotsavam at Sri Venugopalaswamy temple in Karvetinagaram, the deity graced the devotees by riding on a finely decked Mutyapu Pandiri in Kaliyamardhana Alankaram on Friday night accompanied by Rukmini and Satyabhama.
 
Temple Deputy EO Smt.Nagaratna, AEO Sri. Parthasarathy, Superintendent in  Sri Somasekhar, temple priests and a large number of devotees participated.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ముత్య‌పుపందిరి వాహనంపై కాళీయమర్ధనుడి అలంకారంలో శ్రీ వేణుగోపాల స్వామి

తిరుపతి, 2024 మే 31: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు శుక్రవారం రాత్రి 7 గంటలకు శ్రీ కాళీయ మర్దనుడి అలంకారంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ముత్య‌పుపందిరి వాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతుల సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

వాహన సేవలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈఓ శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్ శ్రీ సోమశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.