KALIYAMARDHANA ALANKARAM ON PENULTIMATE DAY _ కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం

Vontimitta, 24 April 2024: The Kaliyamardhana Alankaram of Sri Kodandarama Swamy on the eighth day of the ongoing annual Brahmotsavam at Vontimitta impressed devotees.

From 7.30 am to 9.30 am the Vahana Seva was held in grandeur.  

Bhajan groups played bhajans and kolatams while Swamy rolled along the streets.

After Vahanaseva, Snapana Tirumanjanam ceremony started at 11 am to Sri Sita Rama Lakshmana utsava murthies.

Temple Deputy EO Sri Natesh Babu and others participated.

As a part of Sri Kodandaramaswamy Brahmotsavam, Chakra Snanam will be held on April 25 between 10:30am and 11:15am.

Brahmotsavam concludes with Dhwajavarohanam at 7 pm.

The annual Pushpayagam will be observed on April 26 from 6 pm to 9 pm.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం

ఒంటిమిట్ట, 2024 ఏప్రిల్ 24: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన బుధవారం ఉదయం కాళీయమర్దనాలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు.

ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది. భజన బృందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామివారు పురవీధుల్లో విహరించారు.

వాహనసేవ అనంతరం ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం వేడుకగా ప్రారంభమైంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో
శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు.

రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ న‌టేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్
శ్రీ నవీన్ భక్తులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 25న చక్రస్నానం

శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 10.30 నుండి 11.15 గంటల వరకు చక్రస్నానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయ.

ఏప్రిల్ 26న పుష్పయాగం

శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.