KALIYAMARDHANA ON SARVABHOOPALA _ సర్వభూపాల వాహనంపై కాళీయమర్ధనుడి అలంకారంలో శ్రీనివాసుడు
TIRUPATI, 03 MARCH 2024: As a part of the ongoing annual brahmotsavams in Srinivasa Mangapuram, on the fourth day evening, Sri Kalyana Venkateswara as Kaliyamardhana blessed His devotees on Sarvabhoopala Vahanam on Sunday.
The dance troupes including Koalatam, Chekka Bhajana, added the glamour to the carrier fete.
Spl Gr DyEO Smt Varalakshmi, VGO Sri Bali Reddy and others were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
సర్వభూపాల వాహనంపై కాళీయమర్ధనుడి అలంకారంలో శ్రీనివాసుడు
తిరుపతి, 2024 మార్చి 03: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు కాళీయమర్ధనుడి అలంకారంలో సర్వభూపాల వాహనంపై అభయమిచ్చారు.
రాత్రి 7 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
వాహనసేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, విజివో శ్రీ బాలిరెడ్డి, ఏఈవో శ్రీ గోపినాథ్, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ వెంకటస్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు బాలాజి రంగచార్యులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.