KALYANA VEDIKA GETS READY TO HOST “DIVINE WEDDING” AT VONTIMITTA_ మార్చి 30న ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు

Vontimitta, 28 March 2018: With just a day left for the grand celebration of Sita Rama Kalyanam at Vontimitta, the Kalyana Vedika was beautifully decked up to celebrate the divine wedding on March 30.

To render services to the devotees the services of 1200 Srivari Sevakulu and 800 Scouts are going to be utilised for this fete.

On the big day elaborate arrangements of annaprasadam, buttermilk, water, toilets and security have been made for the convenience of the devotees who flood to witness the celestial marriage. TTD has also erected 24, giant LED screens for the sake of the devotees to witness the grand wedding.

TTD has set up 230 temporary toilets and deployed 350 additional sanitation staff exclusively for the occasion. About 200 Annaprasadam counters are set up. Six lakh butter milk packets, three lakh water satchets will be distributed on the occasion.

OFFICIALS INSPECT

As Honourable Chief Minister of Andhra Pradesh Sri N Chandrababu Naidu is taking part in the kalyanam the district collector Sri Babu Rao Naidu along with SP Bapuji Attada, JC Sri Siva Reddy and RDO Rajampeta Sri Veera brahmam and inspected the arrangements at Kalyana Vedika on Wednesday.

AEO Sri Kodandarama Swamy Group of temples, Vontimitta Sri P Ramaraju, EE Sri Krishna Reddy were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 30న ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు

మార్చి 28, ఒంటిమిట్ట, 2018: ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 30వ తేదీన శ్రీ సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.

శ్రీ సీతారాముల కల్యాణం కోసం టిటిడి సర్వాంగసుందరంగా కల్యాణవేదిక నిర్మించింది. కల్యాణవేదిక వద్ద చలువపందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, నీటి వసతి, పార్కింగ్‌ ప్రదేశాలు తదితర ఏర్పాట్లు చేశారు. భక్తులు కూర్చునేందుకు వీలుగా కార్పెట్‌తో కూడిన షెల్టర్లు ఏర్పాటుచేశారు. ప్రముఖులు కూర్చునేందుకు కల్యాణవేదిక పక్కన వేదిక రూపొందించారు. భక్తుల కోసం 200 ప్రసాద వితరణ కౌంటర్లు, భక్తులందరికీ అందుబాటులో 6 ల‌క్ష‌ల తాగునీటి ప్యాకెట్లు, 3 ల‌క్ష‌ల మ‌జ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నారు. కల్యాణం ముగిసిన అనంతరం భక్తులందరికీ ముత్యంతో కూడిన తలంబ్రాలను ప్యాకెట్‌ రూపంలో అందించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.

భక్తులు ప్ర‌వేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు వేర్వేరుగా ద్వారాలు ఏర్పాటుచేశారు. 230 తాత్కాలిక మరుగుదొడ్లు అందుబాటులో ఉంచారు. భ‌ద్ర‌త కోసం బారీకేడ్ల‌ను రూపొందిస్తున్నారు. శ్రీకోదండరామాలయం వద్ద, చెరువు కట్ట వద్ద, కల్యాణవేదిక పక్కన వాహనాల పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. 1200 మంది శ్రీవారి సేవకులు, 800 మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ భక్తులకు సేవలందించ‌నున్నారు. జిల్లా ఎస్‌పితో సమన్వయం చేసుకుని సిసి కెమెరాల ఏర్పాటుతోపాటు 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. కల్యాణాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయడంతోపాటు భక్తులందరూ వీక్షించేందుకు వీలుగా 15 హెచ్‌డి డిస్‌ప్లే స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు సమాచారం, సూచనలిచ్చేందుకు రేడియో, బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం ద్వారా ఎప్పటికప్పుడు ప్రకటనలిచ్చే ఏర్పాటు చేశారు. ఎండ వేడి నుంచి ఉపశమనం కల్పించేందుకు వీలుగా కల్యాణవేదిక ప్రాంగణంలో నిరంతరాయంగా నీటితో పిచికారి చేస్తున్నారు. కల్యాణవేదికకు నాలుగువైపులా వైద్యశిబిరాలు ఏర్పాటుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప్రథమ చికిత్స కేంద్రాలతో పాటు పారామెడికల్‌ సిబ్బంది, మందులు, అంబులెన్సు అందుబాటులో ఉంచనున్నారు. భక్తులు ఎక్కువ మంది విచ్చేసే అవకాశముండడంతో కల్యాణవేదిక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు 350 మంది పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఒంటిమిట్ట ఆల‌యం, క‌ల్యాణ‌వేదిక ప్రాంగణం శోభాయ‌మానంగా ఉండేలా విద్యుత్ అలంక‌ర‌ణ‌లు, పుష్పాలంకరణలు, స్వాగత ఆర్చిలు, ఎల్‌ఇడి బోర్డులు ఏర్పాటుచేశారు.

శ్రీ సీతారాముల క‌ల్యాణం ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్ శ్రీ బాబురావు నాయుడు

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 30వ తేదీ శుక్ర‌వారం జ‌రుగ‌నున్న శ్రీ సీతారాముల క‌ల్యాణం ఏర్పాట్ల‌ను క‌డ‌ప జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ టి.బాబురావు నాయుడు, జిల్లా ఎస్‌పి శ్రీ అట్టాడ బాబుజి క‌లిసి బుధ‌వారం ప‌రిశీలించారు. గౌ.. ముఖ్య‌మంత్రి క‌ల్యాణానికి విచ్చేయ‌నున్న నేప‌థ్యంలో క‌ల్యాణ‌వేదిక వ‌ద్ద భ‌ద్ర‌త త‌దిత‌ర ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో క‌డ‌ప జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ శ్రీ శివారెడ్డి, రాజంపేట ఆర్‌డిఓ శ్రీ వీరబ్ర‌హ్మం, ఈఈ శ్రీ కృష్ణారెడ్డి, ఒంటిమిట్ట ఆల‌య ఏఈవో శ్రీ పి.రామ‌రాజు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలు :

మార్చి 30న కల్యాణోత్సవం సందర్భంగా సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు శ్రీమతి మండా సుధారాణి, శ్రీమతి వందన, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ చైతన్య సోదరులు గాత్ర సంగీత కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు శ్రీ దీవి హయగ్రీవాచార్యులు, శ్రీ కడిమెళ్ల వరప్రసాద్‌, శ్రీబి.వి.నరసింహదీక్షితులు కల్యాణోత్సవానికి ప్రత్యక్ష వ్యాఖ్యానం చేస్తారు. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.